వారి ముఖచిత్రాలేమిటో..!!
Vijayasai Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై దేశ రాజధానిలో ఉద్యమించడానికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతోంది.
50 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రానికి వివరించాలని, ఈ పోరాటానికి కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొంటామంటూ వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనబోతోన్నారు.

ఈ నేపథ్యంలో- వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సోమవారం రాత్రి ఆయన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని, మర్యాదపూరకంగా కలిసినట్లు చెబుతున్నారు.
రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. అదే సమయంలో లోక్‌సభ తరహాలోనే ఇక్కడా తన సంఖ్యాబలాన్ని కోల్పోయింది బీజేపీ. బిల్లులు ఆమోదం పొందాలంటే మిత్ర పక్షాలు లేదా తటస్థ పార్టీలకు చెందిన సభ్యుల ఓట్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే..రాజ్యసభలో అధికార ఎన్డీఏ పక్షం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇస్తామంటూ ఇటీవలే విజయసాయిరెడ్డి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అదే వైఖరిని కొనసాగించాలంటూ మొన్నటి పార్లమెంటరీ పార్టీ భేటీలో వైఎస్ జగన్ కూడా తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో సాయిరెడ్డి.. అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications