చంద్రబాబును దోమలతో చంపేస్తారేమో ? లోకేష్ వ్యాఖ్యలపై సాయిరెడ్డి సెటైర్లు..
ఏపీలో చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఇప్పటికే చర్చోపచర్చలు సాగుతుండగా.. తాజాగా రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనకు దోమల ముప్పు ఉందన్న చర్చ మొదలైంది. అదే జైల్లో ఓ ఖైదీ డెంగీ దోమ కుట్టి చనిపోవడంతో చంద్రబాబుకూ దోమల నుంచి ముప్పు ఉందని టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జైల్లో దోమలతో కుట్టించి చంద్రబాబును చంపేసే కుట్ర జరుగుతోందని ఆయన తనయుడు నారా లోకేష్ ఇవాళ ఆరోపించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో సైకో జగన్ మా అధినేత చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది.. జైలులోనే అంతం చేసేందుకేనని అనుమానం బలపడుతోందని తెలిపారు. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేశారన్నారు. జెడ్‍ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర చేస్తోందన్నారు.

సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9
— Lokesh Nara (@naralokesh) September 21, 2023
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అంతే ఘాటుగా ట్వీట్ చేశారు. మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోందన్నారు. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టేయాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోందన్నారు. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీంతో చంద్రబాబుకు అసలు హాని వైసీపీ నుంచి కాదని, సొంత పార్టీ టీడీపీ నుంచే ఉందని సాయిరెడ్డి చెప్పినట్లయింది.
మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023












Click it and Unblock the Notifications