AP Polls: చంద్రబాబు బిగ్ ప్లాన్ ! ఈసీ కూడా సపోర్ట్-బయటపెట్టేసిన సాయిరెడ్డి..!

ఏపీలో ఈసారి చావోరేవో అన్నట్లుగా సాగుతున్న ఎన్నికలను గెలిచేందుకు విపక్ష ఎన్డీయే కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలతో జనంలో దూసుకుపోతున్న జగన్ కు అడ్డుకట్టే వేయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీని కలుపుకోవడంతో పాటు క్షేత్రస్దాయిలో ఎన్నో వ్యూహాల్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఈసీ నుంచి కూడా అధికారుల బదిలీల రూపంలో కూటమికి పరోక్ష మద్దతు లభిస్తోంది. దీనిపై ఇవాళ స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.

చంద్రబాబుకు ఈసీ అండదండలున్నాయని, వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడని విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. 5 వేల మంది అను'కుల' ఎన్నారైలు నియోజకవర్గాలను పంచుకుని డబ్బు వెదజల్లుతున్నారన్నారు. జిల్లాకో సంపన్నడిని ఇన్‌చార్జిగా పెట్టారన్నారు. ఎల్లో మీడియా, యూట్యూబ్ ఛానళ్లు నిర్విరామంగా బాకాలూదుతున్నాయన్నారు. ఓటర్ల మనోగతాన్ని అధ్యయనం చేశామంటూ బోగస్ సర్వేలను ప్రజలపైకి వదులుతున్నాయన్నారు.

ysrcp mp vijayasai reddy reveals Chandrababu s big plan to win the election

పెత్తందారులంతా బాబు కోసం విరగబడి పనిచేస్తున్నారని, బాబు నమ్మకం అంతా వారి 'బలం'పైనే అని విజయసాయిరెడ్డి తెలిపారు. జనాన్ని మోసపుచ్చి గెలవాలనే ఆలోచన తప్ప వారి మేలు కోరుకోవడం లేదన్నారు. ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వాదాలు జగన్ గారికి ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుందని, గారి సైనికులం అందరం ఈ నాలుగు రోజులూ శక్తి వంచన లేకుండా శ్రమిద్దామన్నారు.

ysrcp mp vijayasai reddy reveals Chandrababu s big plan to win the election

అప్రమత్తంగా ఉండి ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయాలన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే ఎలక్షన్ అని, ప్రజలకు మేలు చేసేవారే మళ్లీ గెలుస్తారన్నారు. అలాగని మనం విశ్రమించ వద్దని సూచించారు. ప్రతి గంటా మనకు ముఖ్యమైనదేనని, జగన్ ను మరోసారి సిఎంగా చూడాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకుందామని కార్యకర్తలకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+