చంద్రబాబూ తప్పు మీద తప్పు చేస్తున్నావు.. బొక్కబోర్లా పడతావు: విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు రోజుకొక పనికిమాలిన అంశంతో రచ్చ చేస్తున్నారని విమర్శిస్తున్న విజయ సాయి రెడ్డి తాజాగా జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నావు చంద్రబాబు అని సాయిరెడ్డి ఆగ్రహం

ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నావు చంద్రబాబు అని సాయిరెడ్డి ఆగ్రహం

చంద్రబాబూ తప్పు మీద తప్పు చేస్తున్నావు. జగన్ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ఎక్కడ చిన్న పొగ లేచినా నిప్పు రాజేయాలని చూస్తున్నావు అంటూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు సుపారీ మీడియా ద్వారా ఏదో జరగబోతుందని ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నావు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు బొక్కబోర్లా పడేది నువ్వే చంద్రబాబూ.. అంటూ తేల్చి చెప్పారు.

నిజాయితీలేని నిర్ధారణ కమిటీలతో ఏం చెప్పిస్తావో తెలియదా బాబూ?

నిజాయితీలేని నిర్ధారణ కమిటీలతో ఏం చెప్పిస్తావో తెలియదా బాబూ?

అంతేకాదు నీ పబ్లిసీటీ క్రేజ్ వల్లనే గోదావరి పుష్కరాల్లో 30మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే జుడిషియల్ కమిషన్ వేశావు. చివరకు ఏం తేలింది? అంటూ నాటి గోదావరి పుష్కరాల నాటి ఘటనను చేశారు విజయసాయిరెడ్డి. చనిపోయినవారి తొందరపాటు వల్లనే దుర్ఘటన జరిగిందని నీవు 'కోరుకున్నట్టే' నివేదిక వచ్చింది. నిజాయితీలేని నిర్ధారణ కమిటీలతో ఏం చెప్పిస్తావో తెలియదా బాబూ? అంటూ చంద్రబాబునాయుడు నిజనిర్ధారణ కమిటీ లన్నీ ఆయనకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేవే అని తేల్చి చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

వక్రీకరణలు బాబు మెప్పు కోసం కాక మరేమిటి?

వక్రీకరణలు బాబు మెప్పు కోసం కాక మరేమిటి?

రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం వందోసారి స్పష్టం చేసింది. అయినా చంద్రబాబు సుపారీ మీడియా కేంద్ర మంత్రి జవాబునూ వక్రీకరించిందని విమర్శలు గుప్పించారు. అమరావతే రాజధాని అని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పినట్టు బాకా ఊదడం బాబు మెప్పు కోసం కాక మరేమిటి అంటూ ఎల్లో మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు.

Recommended Video

    KCR, DGP Mahinder Reddy పై తీవ్రపదజాలం తో విరుచుకుపడ్డ Dharmapuri Arvind | Oneindia Telugu
    ఎన్టీఆర్ పార్టీకి ఏ గతి పట్టించావు బాబు

    ఎన్టీఆర్ పార్టీకి ఏ గతి పట్టించావు బాబు

    అంతకుముందు విజయవాడ మైనర్ బాలిక ఆత్మహత్యపై చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఎక్కడ శవం దొరుకుతుందా అని ఎదురు చూసి, భుజంపై పాడె మోసేవాడివి. మీ శిష్యుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు బలైన 14 ఏళ్ల పసిబిడ్డ అంత్యక్రియలకైనా వెళ్లాలనిపించలేదా బాబూ? అంటూ చంద్రబాబుకు చురకలంటించారు. ఎన్టీఆర్ పార్టీకి ఏగతి పట్టించావు. ప్రజాబలం ఎలాగూ లేదు.

    చిరునామా కూడా లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నావ్. అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని నాశనం చేస్తున్నాడని విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా సరే విజయ సాయి రెడ్డి బాబు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+