• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్వీయ ఓదార్పు యాత్ర: ప్రజలు నాశనం కావాలని కోరుకున్న చరిత్ర ఆయనది..: సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి ముంపునకు గురైన జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలను నిర్వహిస్తోన్నారు. తొలుత కడప జిల్లాలో ఆయన పర్యటించారు. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్టకు గండిపడటం వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం తన సొంత జిల్లా చిత్తూరులో బాధితులను పరామర్శించారు. తాజాగా నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లారు. బాధితులను పరామర్శించారు.

భువనేశ్వరి ఇష్యూపైనే ఫోకస్..

భువనేశ్వరి ఇష్యూపైనే ఫోకస్..

ఈ సందర్భంగా ఆయన చాలాచోట్ల తన భార్య భువనేశ్వరి అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. రాజకీయాల్లో లేని భువనేశ్వరిని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. నిండు అసెంబ్లీలో అవమానించారంటూ విమర్శించారు. భార్యను అవమానించినందుకు- తాను భావోద్వేగానికి గురయ్యానని, కన్నీరు పెట్టుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా నిప్పులు కురిపించారు.

 ముఖ్యమంత్రిపైనా..

ముఖ్యమంత్రిపైనా..

కింద కాలు పెట్టకుండా హెలికాప్టర్లలో షికారు చేస్తోన్నాడంటూ మండిపడ్డారు. గాల్లో తిరుగుతున్న వైఎస్ జగన్ గాల్లోనే కలిసిపోతాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనతో పెట్టుకున్న వాళ్లందరూ కాలగర్భంలో కలిసిపోయారని, ఈ ముఖ్యమంత్రి కూడా ఫినిష్ అవుతాడంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై విమర్శల జడివానను కురిపిస్తోన్నారు.

స్వీయ ఓదార్పు యాత్రగా..

స్వీయ ఓదార్పు యాత్రగా..

తాజాగా- వైఎస్ఆర్‌సీసీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరద ప్రాంతాల సందర్శనను చంద్రబాబు తన 'స్వీయ ఓదార్పు' యాత్రగా మార్చాడంటూ ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతుల గురించో, వరద ముంపునకు గురైన బాధితుల గురించో చంద్రబాబు మాట్లాడట్లేదని విమర్శించారు. అలా అనుకుంటే పొరపడినట్టేనని, చంద్రబాబు మళ్లీ అదే పాట పాడుతున్నాడంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

తన పరువును తానే..

తన పరువును తానే..


రాజకీయాల్లో లేని తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు చెప్పుకొని తిరుగుతున్నారని సాయి రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు భార్య గురించి ప్రస్తావించకపోయినా ఆయన తన పరువును తానే తీసుకుంటున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు పరువును ఒకరు తీయాల్సిన అవసరం లేదని చెప్పారు. చంద్రబాబు అనే నాయకుడు మేకతోలు కప్పుకొన్న తోడేలు లాంటి వాడని, ఆయన ఆలోచనలన్నీ విషపూరితంగానే ఉంటాయని విజయసాయి రెడ్డి అన్నారు.

ప్రజలకు కూడా శాపనార్థాలు..

ప్రజలకు కూడా శాపనార్థాలు..

తన అసలు స్వరూపం బయట బయట పడకుండా చంద్రబాబు తనను తాను నియంత్రించుకోలేడని చురకలు అంటించారు. అధికార పీఠానికి దూరం చేసిన వైఎస్ జగన్‌పై విషం కక్కడం ఇది మొదటిసారేమీ కాదని గుర్తు చేశారు. చివరికి తనను ఓడించిన ప్రజలు కూడా నాశనమైపోవాలని శాపనార్థాలు పెట్టే ఉన్మాద మనస్తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. అలాంటి ఉన్మాద మనస్తత్వం ఉండటం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ఉద్దేశించి సిగ్గులేదంటూ ఎద్దేవా చేశారని అన్నారు.

 వృద్ధాప్యంలో స్థితప్రజ్ఞత

వృద్ధాప్యంలో స్థితప్రజ్ఞత


పెద్దవాళ్లను గౌరవించాలని చిన్నప్పటి నుంచీ మనం నేర్చుకున్నామని, 72 సంవత్సరాల వయస్సులో చంద్రబాబును ఆ పాటి గౌరవాన్ని కూడా పొందే అర్హతను కోల్పోయాడని విజయసాయి రెడ్డి విమర్శించారు. సీనియర్ సిటిజన్లు తమ సుదీర్ఘ జీవితానుభవాలతో వృద్ధాప్యంలో స్థిత ప్రజ్ఞత కనబరుస్తారని, అందుకే వారిని గౌరవించాలని చెప్పారు. చంద్రబాబు మాత్రం అలాంటి గౌరవాన్ని పొందే అర్హతను కోల్పోయారని అన్నారు. స్థిత ప్రజ్ఞతకు బదులుగా ఉన్మాదంలో మునిగిపోయారని విమర్శించారు.

 శాడిస్టు, ఉగ్రవాది..

శాడిస్టు, ఉగ్రవాది..

చంద్రబాబులో ఒక శాడిస్టు, ఉగ్రవాది దాగి ఉన్నాడని, అందుకే రోజుకో రంగు బయట పెట్టుకుంటున్నాడని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళాడా? లేక ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడా అనేది అర్ధం కావట్లేదని, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల.. ఇలా అన్నింటినీ తన రాజకీయాలకు వాడేస్తున్నాడని ఎద్దేవా చేశారు. వరద సమయంలో ఈ బురద రాజకీయాల పట్ల ప్రజలు అసహ్యించుకుంటున్నారని సాయిరెడ్డి చెప్పారు.

English summary
YSRCP MP Vijayasai Reddy slams TDP Chief and Opposition leader Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X