సాయిరెడ్డితో ఆ ఇద్దరు ఎంపీలు - ఢిల్లీ ఆపరేషన్, నెక్స్ట్..!!
ఢిల్లీ కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయ సాయి రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు రాజీనామా చేస్తు రు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. దీంతో, వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఆ ఇద్దరి నిర్ణయం ఏంటనే చర్చ మొదలైంది. దీంతో, ఢిల్లీలో జరుగుతున్న ఆపరేషన్ వైసీపీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త టర్న్ తీసుకుంటోంది.
ఢిల్లీ ఆపరేషన్
వైసీపీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి రాజకీయాలకు సెలవు ప్రకటించారు. తాను వ్యక్తిగతంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేసారు. కానీ, సాయిరెడ్డి నిర్ణయం వెనుక అనేక ఆసక్తి కర అంశాలు ఉన్నాయి. సాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేసారు. ఇదే సమయంలో సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. కాగా, సాయిరెడ్డి తో పాటుగా మరో ఇద్దరు ఎంపీలు సైతం పార్టీ వీడేందుకు సిద్దం అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే వైసీపీ ఎంపీలు కొందరు సాయి డ్డిని కలుస్తున్నారు. దీంతో, వైసీపీ క్యాంపులో ఉత్కంఠ పెరుగుతోంది.

ఢిల్లీలోనే వైసీపీ ఎంపీలు
వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఢిల్లీ చేరుకున్నారు. అదే విధంగా విదేశాల్లో ఉన్న మరో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఢిల్లీకి వస్తున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి తాజాగా సాయిరెడ్డితో సమావేశమయ్యారు. అయితే.. అయోధ్య రామిరెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నా రనే ప్రచారం సాగింది. కానీ, ఆయన ఖండించారు. ఈ మధ్నాహ్నం ఢిల్లీలో అయోధ్య రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అదే విధంగా పిల్లి బోస్ సైతం సాయిరెడ్డి రాజీనామా పైన స్పందించారు. మరోసారి అయోధ్య రామిరెడ్డితో కలిసి మాట్లాడనున్నారు. ఈ ఇద్దరి ఢిల్లీ టూర్ వేళ పలు చర్చలు తెర పైకి వస్తున్నా.. వారు వైసీపీలోనే కొనసాగుతారని వారి మద్దతు దారులు స్పష్టం చేస్తున్నారు.

జగన్ నెక్స్ట్ స్టెప్
కాగా, సాయిరెడ్డి వైసీపీలో కీలక నేతగా పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సాయిరెడ్డి రాజకీయా ల్లో కొనసాగాలని కోరుతున్నామని వెల్లడించారు. ఢిల్లీలో సాయిరెడ్డితో బోస్ సమావేశం కానున్నారు. అయితే, వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల పైన కూటమి గురి పెట్టింది. సాయిరెడ్డితో పాటుగానే మరో ఇద్దరు పార్టీ వీడుతారనే ప్రచారం సాగింది. కానీ, ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కాగా, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. దీంతో, ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నా .. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications