మోడీ ప్రభుత్వానికి చెప్పండి!: నేడు రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ ఎంపీలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం తదితర అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. విభజన సమయంలో ఇచ్చిన ఏ హామీలు అమలు కాని విషయాన్ని ఆయనకు తెలియజేయనున్నారు.

  2019లో అధికారంలోకి వచ్చేది మేమే : విజయసాయి రెడ్డి

  ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న వైసీపీ ఎంపీలు మధ్యాహ్నం రాష్ట్రపతిని కలసి ఓ మెమొరాండం సమర్పిస్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పనున్నారు. వాటిని నెరవేర్చాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సూచించాలని కోరనున్నారు.

  YSRCP MPs to meet President Kovind today

  విభజన హామీలపై తాము రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు వచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 2019 ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party MPs and leaders will meet President Ramnath Kovind today afternoon.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి