ఏపీకి గుడ్‌న్యూస్: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ ఏపీ ప్రభుత్వానికి తీపి కబురు చెప్పింది. బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. దీంతో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం రానుంది.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. భేటీ అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభసభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీఎంబర్స్‌మెంట్ చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. మొత్తం ఐదు అంశాలపై కేంద్రమంత్రితో చర్చిచించినట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడులను క్లియర్ చేయడం, సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమి ఆమోదించింది. రూ. 55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరామని, కమిటీ సూచించిన మేరకు రూ. 47,725 కోట్లు ఆమోదిస్తామన్నారని తెలిపారు.
బిల్లుల విషయంలో కాలయాపన లేకుండా ఎస్క్రో ఖాతా తెరవాలని అడిగామని చెప్పారు. అయితే, అది సాధ్యం కాదని, వారం పదిరోజుల్లో రీఎంబర్స్‌మెంట్ చేస్తామన్నారని తెలిపారు. కాగా, కేంద్ర జలశక్తి శాఖ ఇప్పుడు ఆ అంచనాలకు ఆమోదం తెలపడంతో పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications