అసెంబ్లీకి పిల్లి సుభాష్, మార్గాని భరత్- సీట్లు ఖరార్: మరో మంత్రికీ స్థానచలనం: జగన్ గేమ్
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి- గంజి చిరంజీవి, రేపల్లె- ఈవూరు గణేష్, గాజువాక- వరికూటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు.

అసెంబ్లీ నియోజకవర్గాల మార్పుపై మరో జాబితా సిద్ధమౌతోంది. ఇద్దరు ఎంపీలు, ఓ మంత్రికి పేరు ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌ను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతారని సమాచారం.
పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తారని అంటున్నారు. గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారాయన. ప్రస్తుతం ఈ నియోజవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు.
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్‌కు మార్పు చేస్తారని తెలుస్తోంది. లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వారిద్దరికీ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ.. రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతోంది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవానీ, రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మండపేట నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications