వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశలపై నీళ్లు: లోకసభ నుంచి జగన్ పార్టీ ఎంపీల వాకౌట్

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్లను ప్రకటించినందుకు నిరసనగా లోకసభ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్లను ప్రకటించినందుకు నిరసనగా లోకసభ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. బుధవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్రజల ఆశలను కేంద్ర ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు. కేపిటల్ గెయిన్స్ పన్ను రద్దు వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో భూములు ఇచ్చి రైతులకు ట్యాక్స్ గెయిన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

YSRCP MPs walk out from Lok sabha

అమరావతి రైతులకు వరమిచ్చిన కేంద్రం

అమరావతి ప్రాంతంలో ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం అత్యంత వినూత్నంగా భూసమీకరణ జరిగిందని ఆయన ప్రశంసించారు. రాజధాని రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌) మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
YSRCP MPs walk out from Lok sabha on Wednesday for not giving special status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X