కోపమొస్తే కొట్టడం, నోటికి వచ్చినట్టు మాట్లాడమే బాలయ్య నైజం: శిల్పా
నంద్యాల: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడుతారో తెలియదని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు కోపమొస్తే కొడతాడని శిల్పా మోహన్‌రెడ్డి బాలయ్య తీరును తప్పుబట్టారు.
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శిల్పా మోహన్‌రెడ్డి గురువారం నాడు రోడ్‌షోలలో మాట్లాడారు. బాలకృష్ణకు తన గురించి ఏమి తెలుసునని ఆయన ప్రశ్నించారు.

తాను పుట్టింది టిడిపిలో పుట్టలేదన్నారు. కాంగ్రెస్‌లో పుట్టి టిడిపిలో చేరారని ఆయన గుర్తుచేశారు. ఏమి తెలుసుకోకుండానే బాలకృష్ణ మాట్లాడడం సరైందికాదని శిల్పా మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
మూడున్నర ఏళ్ళుగా నంద్యాలను ఎప్పుడైనా పట్టించుకొన్నారా అంటూ శిల్పా ప్రశ్నించారు. ఉఫఎన్నికలు రాకపోతే నంద్యాలకు ఇన్ని నిధులు ఇచ్చేవారా అని ఆయన ప్రశ్నించారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని శిల్పా చెప్పారు. ఎవరికి ఓటెయ్యాలో ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications