వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దేవినేని ఓ పిచ్చికుక్క.. అంతా కమిషన్ల బాగోతమే'; బాబు దొరికితే కేసులేవి?: అంబటి

ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రతిపక్ష వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. సోమవారం పార్టీ మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధులు పార్థసారధి, అంబటి రాంబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రతిపక్ష వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. సోమవారం పార్టీ మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధులు పార్థసారధి, అంబటి రాంబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

పోలవరంపై దేవినేని వ్యాఖ్యలను పార్థసారధి తీవ్రంగా తప్పుపట్టగా.. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాన్ని అంబటిరాంబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ అడ్డుకుంటుందన్న దేవినేని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పార్థసారధి ఘాటుగా స్పందించారు.

దేవినేని ఉమా.. ఓ పిచ్చికుక్క:

దేవినేని ఉమా.. ఓ పిచ్చికుక్క:

కృష్ణా జిల్లాలో ఎవరిని అడిగినా మంత్రి దేవినేని కమిషన్ల బాగోతం గురించి చెబుతారని పార్థసారధి విమర్శించారు. దేవినేని ఉమ ఓ చేతగాని దద్దమ్మ అని బ్రోకరిజంలో నంబర్ వన్ అని, ఉన్మాదిలా మారి పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

భరించేదెవరు కేంద్రమా? రాష్ట్రమా?:

భరించేదెవరు కేంద్రమా? రాష్ట్రమా?:

పోలవరం అంచనా వ్యయం పెరిగిన నేపథ్యంలో.. పెరిగిన అంచనా వ్యయాన్ని కేంద్రం భరిస్తుందా? లేక రాష్ట్రం భరిస్తుందా? అన్నది స్పష్టతనివ్వాలని పార్థసారధి తెలిపారు. ఏపీపై ఒక్క రూపాయి భారం పడినా సహించేది లేదన్నారు. ఇప్పటికైనా దేవినేని తన పిచ్చివాగుడు మాని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పూర్తి చేస్తారా? చేతగాదంటారా?

పూర్తి చేస్తారా? చేతగాదంటారా?

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వైసీపీ ప్రాజెక్టును అడ్డుకుంటుందని ప్రచారం చేయడం సరికాదన్నారు పార్థసారధి. ప్రశ్నించినందుకే బురద జల్లుతారా? అని నిలదీశారు. పట్టిసీమ కోసం పోలవరాన్ని జాప్యం చేశారని అన్నారు. పోలవరానికి కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో చెప్పే దమ్ము లేకనే ప్రతిపక్షంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? లేక చేతగాదని తప్పుకుంటారా? అని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యం ఖూనీ:

ప్రజాస్వామ్యం ఖూనీ:

ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక వాయిదా పడటాన్ని తప్పుపడుతూ.. చంద్రబాబు పోలీసులను ఉపయోగించి ఉపఎన్నికను వాయిదా వేయించారని అంబటి రాంబాబు విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రభుత్వం నిర్వహించలేదా అని ప్రశ్నించారు. చేతికి ఉంగరం, మెడలో చైన్ కూడా లేదని చెప్పే చంద్రబాబు.. వందలకోట్లతో రహస్యంగా ఎలా ఇల్లు కట్టుకుంటారని నిలదీశారు.

బాబు దొరికతే కేసులేవి?:

బాబు దొరికతే కేసులేవి?:

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీని నిర్వీర్యం చేయలేరని అంబటి రాంబాబు అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. తాము ప్రజల వెంటే ఉంటామని, ప్రజల తరుపున పోరాడతామని తెలిపారు.

'ఓటుకు నోటు కేసులో దొరికినా చంద్రబాబుపై కేసులు లేవని, మనవాళ్లు బ్రీఫుడు మీ అన్న వాయిస్ ఆయనదేనని రుజువైందని' అంబటి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాకే జగన్ పై ప్రేరేపిత కేసులు పెట్టించారని ఆరోపించారు.

English summary
Ysrcp leader Pardasaradhi fired on minister Devineni Uma over polavaram project issue, He alleged that devineni is a commission agent in irrigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X