సంబరం: భారతి నవ్వు, ఫోన్లో విని విజయమ్మ(పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, రాష్ట్రంలోని కార్యాలయాల వద్ద సోమవారం కోలాహలం కనిపించింది. నాయకులు, కార్యకర్తలు కార్యాలయాల వద్దకు చేరుకొని బాణసంచా కాల్చారు. మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు.

పలువురు పార్టీ నేతలు న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించారు. జగన్‌కు బెయిల్ రావడం అందరికీ సంతోషకరమని, ముఖ్యంగా సీమాంధ్ర ఉద్యమం చేస్తున్న వారికి సంతోషకరమైన విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తుందన్నారు.

జగన్‌కు బెయిల్ రావడం పైన జగన్ సతీమణి భారతి మాట్లాడుతూ.. బెయిల్ వచ్చిందన్న విషయం తెలియగానే సంతోషంతో తన కాళ్లు, చేతులు వణికిపోయాయని, తన కూతురు హర్ష ఆనందంతో కన్నీరు కార్చిందని చెప్పారు. దేవుడికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని, ఎనిమిదిసార్లు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని గుర్తు చేసుకున్నారు. 16 నెలల అనంతరం బెయిల్ వచ్చిందని జగన్ విడుదల కోసం(మంగళవారం బయటకు వచ్చే సమయం కోసం) ఎదురు చూస్తున్నామన్నారు. పార్టీ కూడా అందుకోసమే ఎదురు చూస్తోంది.

పోలీసుకు మిఠాయి

పోలీసుకు మిఠాయి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆనందంతో నాంపల్లి కోర్టు వద్ద ఓ పోలీసుకు మిఠాయి తినిపిస్తున్న కార్యకర్త.

ఆనందహేల

ఆనందహేల

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల ఆనందహేళ.

భారతి మోములో నవ్వు

భారతి మోములో నవ్వు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆయన సతీమణి మొహంలో నవ్వు.

నాంపల్లి కోర్టు వద్ద

నాంపల్లి కోర్టు వద్ద

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల ఆనందం.

డ్యాన్స్

డ్యాన్స్

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆనందంతో నాట్యం చేస్తున్న దృశ్యం.

ఆనందం

ఆనందం

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల సంతోషం.

కోలాహలం

కోలాహలం

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల కోలాహలం.

నగరంలో

నగరంలో

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో నగరంలో ఆ పార్టీ కార్యకర్తల ఆనందం.

బెయిల్ వచ్చిందా! విజయమ్మ ఆనందం

బెయిల్ వచ్చిందా! విజయమ్మ ఆనందం

తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని తెలియడంతో విజయమ్మ ఆనందం.

విజయమ్మతో నేతలు

విజయమ్మతో నేతలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో విలేకరులతో విజయమ్మ మాట్లాడుతున్న దృశ్యం.

మనవరాళ్లతో ఆనందం

మనవరాళ్లతో ఆనందం

వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తన మనవరాళ్లతో ఆనందం పంచుకున్నారు.

విజయమ్మతో కూతురు, కోడలు

విజయమ్మతో కూతురు, కోడలు

వైయస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు బెయిల్ ఇవ్వడంతో లోటస్ పాండు వద్ద కోడలు భారతి, కూతురు షర్మిలతో వైయస్ విజయమ్మ.

బాణసంచా

బాణసంచా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా పేలి సంబరం జరుపుకున్నారు.

జై జగన్

జై జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జగన్‌కు, పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

హైదరాబాద్ సెంట్రల్ వద్ద

హైదరాబాద్ సెంట్రల్ వద్ద

వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో పంజాగుట్ట చౌరస్తలోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జగన్‌కు, పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

మిఠాయి తినండి

మిఠాయి తినండి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు మిఠాయి పంచుతున్న పార్టీ కార్యకర్త.

నోట్లో మిఠాయి

నోట్లో మిఠాయి

నోట్లో మిఠాయి

వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మకు మిఠాయి తినిపిస్తున్న పార్టీ మహిళా కార్యకర్తలు.

రోడ్లలో ర్యాలీ

రోడ్లలో ర్యాలీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+