జిల్లాల పర్యటన వేళ జగన్ కీలక నిర్ణయం..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు నుంచి జగన్ కార్యకర్తలతో సమావేశాలకు నిర్ణయించారు. ఇందు కోసం వారంలో మూడు రోజులు పార్లమెంటరీ నియోజకవర్గా ల వారీగా సమావేశం అవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా కమిటీలు.. నియోజకవర్గాల సమన్వయ కర్తల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించిన జగన్.. ఇక, రాష్ట్ర స్థాయి పోరాటాల దిశగా కసరత్తు చేస్తున్నారు.
మాజీ సీఎం జగన్ ఇక జనంలోకి రావాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ నెల నాలుగో వారం నుంచి ముందుగా పార్లమెంటరీ జిల్లాల వారీగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేడర్ తో మమేకం కావాలని డిసైడ్ అయ్యారు. ఇక కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే జగన్ స్పష్టం చేసారు. ప్రస్తుతం జగన్ జిల్లాల పర్యటనల పైన షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. ముందుగా సీమ జిల్లాల నుంచే ఈ పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివర వారం.. మార్చిలో నిర్వహించే అవకాశాన్ని ఈ షెడ్యూల్ ఖరారు వేళ చర్చకు వచ్చింది. షెడ్యూల్ ఫిక్స్ చేయటం పై జగన్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక, వరుసగా అన్ని నియోజకవర్గాల్లో కేడర్ తో సమావేశాలు ముగిసే లోగా అన్ని జిల్లాలు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ క్షేత్ర స్థాయి నియామకాలను పూర్తి చేయనున్నారు. ఇందు కోసం జిల్లాల పర్యటన సమయంలోనే నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షలను.. నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమించారు. ప్రభుత్వం పైన మూడు అంశాల్లో పోరుబాట ప్రారంభించిన వైసీపీ విద్యార్ధుల ఫీజు రీయంబర్స్ మెంట్ పైన పోరుబాట కు నిర్ణయించారు. తొలుత జనవరి 3న నిర్వహించాలని భావించగా.. ఈ నెల29వ తేదీకి వాయిదా వేసారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్ధులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ తో విద్యార్ధులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం ఇచ్చేలా ఈ పోరుబాట కార్యక్రమం ఖరారు చేసారు. ఇక, ప్రతీ బుధ, గురువారం జిల్లాల్లో ప్రతీ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు...కేడర్ తో సమావేశానికి వీలుగా ముందుగా రెండు జిల్లాల షెడ్యూల్ విడుదల పై కసరత్తు జరుగుతోంది. జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రకటించిన తొలి నిరసన కార్యక్రమం కావటంతో రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications