Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆకాశంలో హాయ్ హాయ్, ఎపి మంత్రులతో వైసిపి అధినేత జగన్ సరదా సంభాషణ

వారు ఎప్పడూ ఒకరిపై మరోకరు ఒంటికాలిపై లేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అంటే అసెంబ్లీ లో కాని, బయట కాని మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడతారు.

అమరావతి :వారు ఎప్పడూ ఒకరిపై మరోకరు ఒంటికాలిపై లేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అంటే అసెంబ్లీ లో కాని, బయట కాని మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడతారు. ఇతర మంత్రులు కూడ అదే తరహలో వ్యవహారిస్తారు. కాని, మంత్రులు జగన్ తో సరదాగా సంబాషించారు. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొన్నారు. తనను పట్టించుకోండని జగన్ కోరితే పట్టించుకొంటున్నామంటూ మంత్రులు సమాధానమిచ్చారు.

ఒకే విమానంలో మంత్రులు,జగన్ ప్రయాణం

ysrcp president jagan chitchat with ap ministers in aeroplane

డిసెంబర్ 1వ, తేదిన ఆంద్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అమరావతిలో ఉంది,. అదే రోజు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కూడ ఉంది. అయితే అదే రోజున బంరు పోర్టు భూముల నిర్వాసితుల తరపున పోరాటంలో పాల్గొనేందుకు జగన్ హైద్రాబాద్ నుండి గన్నవరం వెళ్తున్నాడు. అదే విమానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పుల్లారావు, కె.ఇ. కృష్ణమూర్తి ,20 సూత్రాల అమలు కమిటీ చైర్మెన్ సాయిబాబాలు వెళ్తున్నారు. అయితే జగన్ తన సీటులో కూర్చునేందుకు వెళ్ళే సమయంలో అదే విమానంలో ఉన్న మంత్రులకు నమస్కరిస్తూ వారితో సంభాషించారు.ఏ టీవిలో చూసిన నీవే కన్పిస్తున్నావు అంటూ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మెన్ సాయిబాబాను పలకరించాడు సాయిబాబా.

కుశల ప్రశ్నలు వేసుకొన్నారు

ysrcp president jagan chitchat with ap ministers in aeroplane

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీలోనూ, బయట కూడ అధికారపార్టీని ఇరుకునపెట్టే కార్యక్రమాలను తీసుకొంటున్నారు.అసెంబ్లీ లోనూ బయట కూడ ఇదే రకమైన పరిస్థితులున్నాయి. మంత్రులు విపక్ష నాయకుడి మధ్య ఎప్పుడూ కూడ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. కాని, బయట కన్పించినా కాని, ఈ నేతలు ఒకరిపై మరోకరు ఆత్మీయంగా పలకిరించుకొన్న సందర్భాలు కూడ అరుదే. అయితే ఇటీవల మంత్రులతో వైఎస్ జగన్ కుశల ప్రశ్నలు వేశారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.వారి కుటుంబసభ్యులు ఎలా ఉన్నారని జగన్ మంత్రుల కుటుంబసభ్యుల గురించి ఆరా తీశారు.

నన్ను పట్టించుకోండన్న జగన్

ysrcp president jagan chitchat with ap ministers in aeroplane

మమ్మల్ని కనిపెట్టండి అంటూ వైఎస్ జగన్ మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గన్నవరం వెళ్ళేందుకు ఒకే విమానంలో వెళ్తున్నారు. అయితే అదే విమానంలో ఉన్న మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడులను చూసి నమస్కరించారు. కొద్దిగా మమ్ములను కనిపెట్టండి అని జగన్ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే కనిపెట్టుకొనే ఉన్నాం అంటూ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

హరి ఎలా ఉన్నాడు

ysrcp president jagan chitchat with ap ministers in aeroplane

ఇదే విమానంలో ఉన్న డిప్యూటీ సిఎం కె.ఇ. కృష్ణమూర్తిని వైఎస్ జగన్ పలకరించాడు. హారి ఎలా ఉన్నాడని ఆయన కె.ఇ. అడిగాడు. కె.ఇ కొడుకు హారి, జగన్ హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో క్లాస్ మేట్స్. హారి బాగానే ఉన్నాడని ఆయన కె.ఇ బదులిచ్చాడు. మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడుతో మాట్లాడుతున్న సందర్భంలో రాయలసీమ వాళ్ళు కనిపించరా అంటూ కెఇ జగన్ ను అడిగారు. అయితే సర్ మీరు పెద్ద వాళ్ళు ఉన్నవిషయాన్ని నేను గమనించలేదు అంటూ జగన్ కె.ఇ తోమాట్లాడారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+