వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూచిపై జగన్ క్లాస్: యు టర్న్‌పై శోభా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో తమ పార్టీకి ఒప్పందం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. గురువారం పలువురు నాయకులు జగన్ వద్దకు వెళ్లి కాంగ్రెసు అధిష్టానంతో ఒప్పందు కుదిరిందని జరుగుతున్న ప్రచారం గురించి చెప్పారు.

దానికి జగన్ స్పందిస్తూ.. ఆ ప్రచారానికి మీ మాటలే ఊతమిస్తున్నట్లుందని, కాంగ్రెసుతో ఒప్పందం ఉండదని గట్టిగా ఎందుకు చెప్పరని మందలించారట. మీరు చొరవ తీసుకోకపోవడం... పార్టీ పరంగా దూసుకు వెళ్లలేకపోయినందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని జగన్ వారికి క్లాస్ పీకారట. మరోవైపు గురువారం రాజీనామాలు ఆమోదింప చేసుకుంటామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా.. కాంగ్రెసు అధిష్టానం ఒప్పందంలో భాగంగా వారు రాజీనామాలు ఆమోదింప చేసుకుంటున్నారని ప్రచారం జరగడంతో వారు వెనక్కి తగ్గారు.

ముఖ్యమంత్రికి విజయమ్మ లేఖ

అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలోను సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం లేనిదే కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టలేదని కేంద్రం స్పష్టం చేసిందని అందులో పేర్కొన్నారు.

ప్రెస్ మీట్

ప్రెస్ మీట్

హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు.

శోభా నాగి రెడ్డి

శోభా నాగి రెడ్డి

గురువారం స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదింప చేసుకుంటామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో అసెంబ్లీ సమావేశానికి డిమాండ్ చేశారు.

విలేకరులతో

విలేకరులతో

అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి గురువారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

జగన్

జగన్

పదహారు నెలల అనంతరం బెయిల్ పైన విడుదలైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన అభిమానులు.

జగన్‌కు బొకేలు

జగన్‌కు బొకేలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపుతూ, బొకేలు అందిస్తున్న అభిమానులు.

జగన్‌తో చేతులు కలిపేందుకు

జగన్‌తో చేతులు కలిపేందుకు

పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు ఎగబడుతున్న కార్యకర్తలు, అభిమానులు.

English summary
The YSR Congress MLAs suddenly changed their strategy on resignations and demanded the government to convene the Assembly and table the resolution seeking united AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X