Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ నిరసన, నినాదాలు - సభలో ఆ వెంటనే..!!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కాగానే.. వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. మాజీ సీఎం జగన్ తో సహా వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సభ్యుల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆ వెంటనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. సభకు హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం వేళ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని నినాదాలు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్స్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసారు. 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొచ్చిన మార్పులు... పథకాల అమలు గురించి గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.

YSRCP protest amid Governor speech in the Assembly slogans against attacks on party leaders houses

ఆ సమయంలో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అన్ని రంగాల్లో అద్భుత పాలన సాగిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో స్పీకర్ పోడియం చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ... నిరసనకు దిగారు. గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఆ తరువాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసారు. ప్రభుత్వం సాధించిన పురోగతిని గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. సమావేశాల వేళ ఎలా వ్యవహరించాలనే అంశం పైన చర్చించనున్నారు. సభకు వెళ్లే ఎమ్మెల్యేలు వెళ్లవచ్చని జగన్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా మండలిలో మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్ల పై దాడులు, ఆర్దిక పరిస్థితి పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్దేశించారు.

కాగా.. గవర్నర్ ప్రసంగం అయిన తరువాత బీఏసీ సమావేశం కానుంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి .. అజెండా ఖరారు చేయనుంది. బీఏసీకి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల గురించి సభ లో చర్చించి.. ప్రజలకు వివరించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో.. వైసీపీ హాజరు పై తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+