వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా లోకేష్‌ను అలా.. అలా.. పైకి లేపుతున్న వైసీపీ??

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన‌ప్పుడు మాట్లాడే విధానంలోను, ఆహార్యంలోను తేడా ఉండేది. ఈ అంశాల‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారాస్త్రాలుగా మార్చుకొని విజ‌య‌వంత‌మైంది. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. క్ర‌మేణా లోకేష్ కూడా త‌న వేష‌భాష‌లు మార్చారు. మాస్ లీడ‌ర్ గా అవ‌తార‌మెత్తారు. భాష‌ను కూడా స్ప‌ష్టంగా ఉచ్ఛ‌రిస్తున్నారు. ఆయ‌న‌లో ఇంత మార్పు తీసుకురావ‌డానికి కార‌ణ‌మైన‌వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లంటే అతిశ‌యోక్తి కాదు.

Recommended Video

మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబూ - అంబటి రాంబాబు *AndhraPradesh | Telugu OneIndia
 ఓట‌మి త‌ర్వాత వ‌చ్చిన మార్పు

ఓట‌మి త‌ర్వాత వ‌చ్చిన మార్పు


మంగ‌ళగిరిలో ఓట‌మి పాలైన త‌ర్వాత లోకేష్ ఎక్క‌డ ప‌ర్య‌టించినా ప్ర‌భుత్వం పోలీసుల‌తో అడ్డ‌గించ‌డం ప్రారంభించింది. దీంతో ఆ విష‌యం మీడియాలో హైలైట్ అవుతోంది. అందుక‌నుగుణంగా ఆయన క్రేజ్‌ను పెంచారు. పోలీసుల‌తోపాటు స్థానిక వైసీపీ నాయ‌కులు కూడా అందుకు దోహ‌ద‌ప‌డ్డార‌ని చెప్ప‌వ‌చ్చు. తాజాగా పలాస‌లో పార్టీ నాయ‌కుణ్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లే స‌మ‌యంలో శ్రీకాకుళం జాతీయ ర‌హ‌దారిపైనే పోలీసులు నిర్బంధించారు. దీంతో ఆయ‌న విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంలో ఐదుగంట‌ల‌పాటు ధ‌ర్నా చేశారు. అడ్డుకున్న విష‌య‌మై కోర్టులో స‌వాల్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ విషయం రాష్ట్రమంతటా వ్యాపించి లోకష్ హైలైట్ అయ్యారు.

 అడ్డుకోవ‌డం.. అరెస్ట్ చేయ‌డం

అడ్డుకోవ‌డం.. అరెస్ట్ చేయ‌డం


గుంటూరులో ప్రేమోన్మాది ర‌మ్య అనే యువ‌తిని హ‌త్య చేసిన స‌మ‌యంలో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ళ‌నీయ‌కుండా అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీనివ‌ల్ల లోకేష్ మైలేజ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా మూడు సంవ‌త్స‌రాల్లో ఇటువంటి సంఘ‌ట‌న‌లు మ‌రికొన్ని జ‌రిగాయి. వాస్త‌వానికి పార్టీ నేత‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళుతున్న లోకేష్ ను అడ్డుకోనివ్వ‌కుండా ఆయ‌న్ని వెళ్ల‌నిస్తే సాధార‌ణంగా ప‌ల‌క‌రించి వెళ్లిపోతారు. దీనివ‌ల్ల ఎవ‌రి కార్య‌క్ర‌మం వారిది స‌జావుగా సాగుతుంది. కానీ అన‌వ‌స‌రంగా లోకేష్‌ను అరెస్ట్‌చేసి పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చి ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి మైలేజ్ తీసుకురావ‌డానికి వైసీపీ నేత‌లే కార‌కుల‌వుతున్నార‌ని ఆ పార్టీ శ్రేణులే గుర్రుగా ఉన్నాయి.

 గ‌తం కంటే భిన్నంగా

గ‌తం కంటే భిన్నంగా


గ‌తం కంటే భిన్నంగా రాజ‌కీయం చేయ‌డం.. దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం, ప‌దునైనా ప‌ద‌జాలంతో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు సంధించ‌డంలాంటివ‌న్నీ లోకేష్ లో వచ్చిన మార్పు అని, అటువంటి మార్పున‌కు తమ పార్టీ ఎంతో దోహ‌ద‌ప‌డింద‌నేని కాద‌న‌లేని స‌త్య‌మ‌ని వైసీపీ నేతలంటున్నారు. మంగళగిరిలో అన్న క్యాంటిన్ ను ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోవడంవల్ల నియోజకవర్గంలో ఆయన బలం పెరిగిందని, ఒకవైపు ఆయన్ను రెండోసారి కూడా ఓడించాలనే లక్ష్యంతో ఉంటే ప్రభుత్వ పరంగా ఆయన్ను అడ్డుకునే చర్యలు మైలేజ్ పెరగడానికి దోహదపడటమే కాకుండా నియోజవర్గంలో బలం పెంచుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

English summary
The ranks of the party are adamant that the YCP leaders are responsible for arresting Lokesh and making the situation tense and getting him a good mileage among the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X