Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటెవరికంటే ? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్..!
అమరావతి : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అదే సమయంలో పోలింగ్ జరుగుతున్న అసెంబ్లీ ప్రాంగణంలో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. దీనికి కారణం వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న క్రాస్ ఓటింగే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయాలు వైసీపీ, టీడీపీని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు వైసీపీకే వేశారా లేక టీడీపీకి వేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఓటు వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో కాసేపు మాట్లాడారు. ఇందులో తాను ఓటెవరికి వేశారన్న దానిపై పరోక్ష సంకేతం ఇచ్చారు. తన ఆత్మప్రబోధానుసారమే ఓటు వేసినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వైసీపీతో విభేదిస్తూ కొంతకాలంగా విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి ఎమ్మెల్సీ పోలింగ్ లో టీడీపీవైపే మొగ్గుచూపుతారన్న అంచనాల నేపథ్యంలో ఆత్మసాక్షిగానే ఓటు వేసినట్లు ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటెవరికంటే ? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్..!!#KotamreddySridharReddy #MLCElections #ApMLCElections #AndhraPradesh #OneIndiaTelugu pic.twitter.com/v5mGQMHZHx
— oneindiatelugu (@oneindiatelugu) March 23, 2023
మరోవైపు వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపైనా స్పందించారు. దీనిపై తనకు సమాచారం లేదన్నారు. వారి ఆత్మల్లోకి దూరి చూసేందుకు తాను దేవుడిని కాదన్నారు. ఎంతమంది ఎలా ఓటేశారో చెప్పడం సమంజసం కాదన్నారు. తాను మాత్రం ఆత్మప్రబోధానుసారమే ఓటేసినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ నుంచి కనీసం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీవైపు మొగ్గినా ఏడో ఎమ్మెల్సీ ఫలితం మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో రెబెల్ ఎమ్మెల్యే ఆనం ఓటుపైనా ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications