నాగబాబు అలియాస్ నాగేంద్రరావు...! వైసీపీ సంచలన ఆరోపణ
జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణలో ఓటు హక్కు ఉండగా, ఏపీలో కూడా దరఖాస్తు చేసుకున్నారంటూ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు, ఆయన భార్య, కుమారుడు ఓటు హక్కు వినియోగించుకున్నారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలో దరఖాస్తు చేశారని చెబుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-168లో కొణిదెల నాగబాబు (సీరియల్ నెంబర్-323), కొణిదెల పద్మజ (సీరియల్‌నెంబర్- 324), సాయి వరుణ్ తేజ్(సీరియల్ నెంబర్-325) ఓటు వేశారని తెలిపింది. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారంటూ కొన్ని ఆధారాలను ఆ పార్టీ పోస్ట్ చేసింది. నాగేంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా.. ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.

'కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ కొణిదెల నాగబాబు చేసిన ఘనకార్యం. ఏం ప్యాకేజ్, మ్యారేజ్ స్టార్? నీతులు పక్కన వాళ్లకు చెప్పడమేనా తమరు పాటించడం ఏం లేదా?'అంటూ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఓ నెటిజన్ భార్గవ్ కు కౌంటర్ ఇచ్చారు. మీరు నోటా పార్టీ అని చెబుతున్నారు.. మరోవైపు జనసేనకు భయపడుతున్నారని, ఆధారాలంటే దానికి సంబంధించిన ఫొటోలు పెట్టాలని సూచించారు. తెలంగాణలో ఓటును రద్దు చేసుకుని.. ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారా?.. లేదంటే అక్కడ ఓటు ఉండగానే ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications