బాలినేని వైపు వేళ్లు, నోళ్లు లెగుస్తున్నాయ్..!!

Balineni Srinivasa Reddy: జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.

ఈ సభలో మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు సంధించారు వైఎస్ఆర్సీపీపై. పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగాడని, జగన్ మాత్రం తన తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆరోపించారు. పిఠాపురం సభ సాక్షిగా, ఇక్కడి అమ్మవారి సాక్షిగా అంతా నిజమే చెబుతానంటూ మాట్లాడారు.

Balineni

రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని, కానీ జగన్ మాత్రం తన ఆస్తులతో పాటు వియ్యంకుడి ఆస్తులను కూడా కాజేశారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందుకే నాలుగేళ్ల మంత్రి పదవిని వదులుకుని జగన్ వెంట నడిచానని బాలినేని గుర్తు చేశారు.

బాలినేని ప్రసంగం.. ఆయనపై విమర్శలకు దారి తీసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి ఆయనే కారణం అనే వాదన తెరమీదికి వచ్చింది. పార్టీని అన్ని విధాలుగా ధ్వంసం చేసిన తరువాతే ఆయన జనసేనలోకి వెళ్లారని, ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందంటూ మండిపడుతున్నారు జిల్లా నాయకులు.

జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ బాలినేని చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకుడు, డీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య తప్పుపట్టారు. బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌కాశం జిల్లాలో గ్రూపులు క‌ట్టి పార్టీని భ్రష్టు పట్టించార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ ద్వారా రాజ‌కీయాల్లో పైకొచ్చి ఇప్పుడు పిచ్చి ప్రేలాప‌ణ‌లు చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు.

బాలినేని పోయాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి విముక్తి కలిగిందని మాదాసు అన్నారు. పార్టీ నాయకులకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. బాలినేని ఎప్పుడూ కూడా జిల్లా నాయకులను జ‌గ‌న్‌తో కలవనిచ్చేవాడు కాద‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్‌ను ఓడించే స్థాయి బాలినేనికి లేదని ఎద్దేవా చేశారు.

Take a Poll

అధికారాన్ని అనుభవించి.. కోట్ల రూపాయలను పోగేసుకొని ఇప్పుడు పార్టీ మారి జ‌గ‌న్‌ను తిట్టడం ఆయన దారుణమ‌ని అన్నారు. జగ‌న్‌ను కించ‌ప‌రిచేలా మ‌రోసారి మాట్లాడితే స‌హించేది లేద‌ని వైఎస్ఆర్సీపీ ఒంగోలు న‌గ‌ర అధ్య‌క్షుడు కటారి శంకర్ వార్నింగ్ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నికల్లో ఒంగోలులో బాలినేని ఎలా గెలుస్తాడో చూస్తామ‌ని స‌వాల్ విసిరారు.

వైఎస్ జ‌గ‌న్ గురించి అవాకులు, చ‌వాకులు పేలిస్తే ఊరుకోమ‌ంటూ వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిని హెచ్చ‌రించారు. బాలినేని మొద‌టి నుంచి టీడీపీ కోవ‌ర్ట్ అని ఆరోపించారు. ఆయ‌నను టీడీపీలో చేర్చుకోక‌పోవ‌డంతో జ‌న‌సేన‌లోకి వెళ్లార‌ని విమర్శించారు.

వైసీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించి బాలినేని అడ్డగోలుగా అక్రమార్జనకు పాల్పడ్డారని చుండూరు రవిబాబు విమ‌ర్శించారు. జ‌గ‌న్‌ను విమ‌ర్శించే స్థాయి బాలినేనికి లేద‌ని, ఆయన చ‌రిత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తానికి తెలుసునని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి బంధువు అయ్యార‌ని పేర్కొన్నారు.

జ‌గ‌న్ వెంట నడవడానికి బాలినేని నెలల తరబడి ఆలోచించారని రవిబాబు గుర్తు చేశారు. కోట్ల రూపాయల ఖర్చుతో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్లింది వాస్త‌వమా? కాదా అని నిలదీశారు. కాసినోలకు వెళ్లి ఆస్తి పోగొట్టుకున్నారని అన్నారు. ఒంగోలులో బ్రాహ్మణుల భూమి కాజేసిన ఘ‌నుడని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+