Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల్లో వైసీపీ అన్ని కోట్లు ఖర్చు చేసిందా?: ఆడిట్ రిపోర్ట్ ఏం చెబుతోంది?

అమరావతి: ఎన్నికలు ఏవైనా.. ఏ రాష్ట్రంలోనైనా విచ్చలవిడిగా డబ్బును వెదజల్లుతారని, మద్యం ఏరులా పారిస్తారనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో బలంగా నాటుకునిపోయింది. నోట్లు ఇస్తే గానీ.. ఓట్లు వేయరంటూ ఆయా పార్టీల నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రచార ఖర్చుపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించినప్పటికీ, పరిమితులను విధించినప్పటికీ.. దానికి కట్టుబడి ఉన్న సందర్భాలు చాలా తక్కువే అనేది నిపుణుల అభిప్రాయం. వందల కోట్ల రూపాయలను వ్యయం చేయడానికి కూడా రాజకీయ నాయకులు ఏ మాత్రం వెనుకాడబోరని అంటుంటారు.

సార్వత్రిక ఎన్నికల దగ్గరికొచ్చేసరికి ఈ ఖర్చు మరింత అధికంగా ఉంటుంది. ఏ పార్టీ ఎంత మొత్తాన్ని వ్యయం చేసిందనే విషయం ఊహకు కూడా అందదు. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత మొత్తాన్ని ఖర్చు చేసిందనే విషయంపై సీఈసీ ఏర్పాటు చేసిన కమిటీ- తన ఆడిట్ రిపోర్ట్‌ను తయారు చేసింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలు ఎంతమొత్తంలో ఎన్నికల వ్యయం చేశాయనే అంశంపై రూపొందించిన ఆడిట్ రిపోర్ట్ అది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

YSRCP spent Rs 89.49 Crore on 2019 elections, says Audit report

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2019 ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టిందనే విషయాన్ని ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అప్పటి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 89.49 కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు ఆడిట్ రిపోర్ట్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందులో 41.49 కోట్ల రూపాయలను మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్‌పై ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. అధికారంలోకి రావడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐప్యాక్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

విరాళాల రూపంలో అత్యధికంగా పార్టీ నిధులను సమీకరించినట్లు ఆడిట్ రిపోర్ట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. వ్యక్తుల ద్వారా 42 కోట్ల రూపాయలు, కార్పొరేట్ ఫండ్స్ రూపంలో 21.54 కోట్ల రూపాయలను సమీకరించినట్లు సమాచారం. దీనితోపాటు- ఎలక్టోరల్ బాండ్స్, ప్రుడెంట్ ట్రస్ట్ వంటి ఛానళ్ల ద్వారా మరో 27 కోట్లను పార్టీ ఫండ్‌గా సేకరించినట్లు చెబుతున్నారు. వైసీపీ ఆవిర్భవించిన తరువాత అత్యధిక ఫండ్‌ను అందుకోవడం అదే తొలిసారిగా భావిస్తున్నారు. 2019లో 99.84 కోట్లు, 2020లో మరో 74.35 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సమీకరించినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+