సంబర పడవద్దు - ఇక సమరమే..!!

కూటమి ప్రభుత్వం పై వైసీపీ పోరుబాట మొదలు పెట్టింది. ఇప్పటికే రైతులకు మద్దతుగా ర్యాలీ లు నిర్వహించిన వైసీపీ .. ఈ రోజు రాష్ట్రంలో పెరిగిన విద్యత్ ఛార్జీలకు నిరసనగా అన్ని జిల్లాల్లో నూ ధర్నాలు నిర్వహించింది. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి.. ప్రజల పైన భారం వేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో కేసులకు తాము భయపడేది లేదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇక ప్రభుత్వం పై సమరం కొనసాగుతుందని ప్రకటించారు.

వైసీపీ పోరుబాట
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల పైన విద్యుత్ ఛార్జీల పేరుతో పెను భారం మోపిందని వైసీపీ పోరుబాట నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ నిరసన వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసులకు భయపడి తాము రాజకీయాలు చేయటం లేదన్నారు. వైసీపీకి 11 సీట్లే అనుకోవద్దు, సంబర పడవద్దు... 40 శాతం ఓట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ చార్జీలతోపాటు, నువ్వు చేసే ప్రజా వ్యతిరేక, పరిపాలనపై వైసీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేసారు.

YSRCP state wide protests today against power charges hike in AP Rallies in all disticts

వైసీపీ నిరసనలు
చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితం అవుతూ అక్కడే వేల కోట్ల అప్పుతో కార్యక్రమాలు చేపడు తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీ లు పెరగవని హామీ ఇచ్చారని.. ఇప్పుడు రూ.15,485.36 కోట్ల భారం వేసారని ఆగ్రహ వ్యక్తం చేసారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల వసూలు ప్రారంభం అయిందని చెప్పుకొచ్చారు. జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడుకు రంగం సిద్దమైందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేప‌ట్టారు.

YSRCP state wide protests today against power charges hike in AP Rallies in all disticts

రద్దు చేయాలని డిమాండ్
విద్యుత్‌ శాఖకు సంబంధించి డిస్కంల సీఎండీ, ఎస్‌ఈ, డీఈఈ, ఏఈ కార్యా­లయాల ముందు వైసీపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. తక్ష­ణమే పెంచిన విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ పత్రాలు సమర్పించారు. అదే విధంగా .. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయటం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నిరసనల పై మంత్రులు ఫైర్ అవుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన జగన్ రెడ్డి హయాంలోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. ధర్నాలు చేసే హక్కు లేదని వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+