11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం- సభలో 32కు పెరిగిన మెజార్టీ : ఎవరి బలం ఎంత..!!

ఏపీ శాసనసభలో పూర్తి మెజార్టీతో ఉన్న అధికార వైసీపీ..ఇప్పుడు శాసనమండలిలోనూ అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో 151 మంది వైసీపీకి ఉండగా... టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే సైతం అదే బాటలో ఉన్నారు. ఇక, శాసన మండలిలో ఇప్పటి వరకు మెజార్టీతో ఉన్న టీడీపీ సంఖ్యా బలం ఒక్కసారిగా తగ్గిపోయింది. స్థానిక సంస్థల కోటాలో నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీకి చెందిన 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

8 జిల్లాల్లో 11 మంది ఏకగ్రీవంగా

8 జిల్లాల్లో 11 మంది ఏకగ్రీవంగా

అనంతపురం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టి. వెంకట శివ నాయుడు తన నామినేషన్ ను ఈరోజు ఉపసంహరించుకోవడంతో... మొత్తం 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీలో సంఖ్యా బలం.. స్థానిక సంస్థల్లో అన్ని జిల్లాల్లో గెలవటం తో పాటుగా గవర్నర్ నామినేటెడ్ కోటాతో కలిసి మొత్తంగా వైసీపీకి కలిసి వచ్చింది. మొత్తం 58 మంది సభ్యులు ఉంటే శాసనమండలిలో ఇప్పుడు వైసీపీ సభ్యుల సంఖ్య 32కు చేరింది. స్థానిక సంస్థల కోటా నుంచి మొత్తం ఎనిమిది జిల్లాల్లో 11 మంది మండలికి ఎన్నికయ్యారు.

వైసీపీ సంఖ్యా బలం 32 కు చేరిక

వైసీపీ సంఖ్యా బలం 32 కు చేరిక


విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు ..విశాఖ నుంచి వరుదు కళ్యాణి, వంశీక్రిష్ణ ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ భాస్కర్ మండలికి ఎంపికయ్యారు. క్రిష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్ ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, మురుగుడు హనుమంత రావు ను ఎంపిక చేయగా వారిద్దరూ సైతం ఇప్పుడు మండలికి ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు మండలికి ఎన్నికయ్యారు.

సభలో తగ్గిపోయిన టీడీపీ సభ్యుల సంఖ్య

సభలో తగ్గిపోయిన టీడీపీ సభ్యుల సంఖ్య


చిత్తూరు జిల్లా నుంచి క్రిష్ణ రాఘవ జయేంద్ర భరత్.. అనంతపురం జిల్లా నుంచి వై శివరామి రెడ్డి ఎన్నికయ్యారు. ఈ 11 స్థానాలు వైసీపీ ఖాతాలో జమ అవ్వటం ద్వారా వైసీపీ సభ్యుల సంఖ్య 32 కాగా, టీడీపీ సంఖ్యా డలం 15కు తగ్గింది. బీజేపీ నుంచి ఒకరు, పీడీఎఫ్ నుంచి నలుగురు సభ్యులు సభలో ఉన్నారు. ఇక, వైసీపీ నుంచి సభ్యులుగా ఉన్న వారిలో 18 మంది ఎస్సీ - బీసీ - మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉంటారు. అందులో నలుగురు మైనార్టీలు. శాసన మండలిలో తొలి సారి నలుగురు సభ్యులు ఒకే పార్టీ నుంచి ఉండటం రికార్డుగా పార్టీ నేతలు చెబుతున్నారు.

18 మంది ఎస్సీ-బీసీ-మైనార్టీ సభ్యులే

18 మంది ఎస్సీ-బీసీ-మైనార్టీ సభ్యులే


అయితే వారిలో ఒక మైనార్టీ సభ్యురాలు కరీమున్నీసా మరణించారు. ఇక, తాము అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులను నాడు టీడీపీ తమకున్న సంఖ్య బలంతో వాటిని అడ్డుకున్నారు. దీంతో..మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసారు. ఇక, తాజాగా మండలి రద్దు తీర్మానం ను జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ మరో తీర్మానం చేసింది. దీంతో..ఇప్పుడు శాసన మండలి సభ్యులు పూర్తి కాలం తమ పదవుల్లో కొనసాగనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+