మళ్లీ సుప్రీంకోర్టుకు వైసీపీ, నామినేషన్లు..ఆధారాలు - కీలక మలుపు..!!
వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి సుప్రీంకు వెళ్లాలని డిసైడ్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో తమకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వలేదని వైసీపీ ఆరోపణ. ఇదే అంశం పైన సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం సూచనల మేరకు ఎన్నికల సంఘం తిరిగి కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లకు అవకాశం కల్పించింది. అయితే, మైదుకూరు మినహా మిగిలిన చోట్ల తమకు అవకాశం ఇవ్వలేదంటూ మరోసారి సుప్రీంలో వాదనలు వినిపించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.
మున్సిపల్ ఎన్నికల పైన వైసీపీ మరోసారి సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలు న్యాయ నిపుణలతో చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన 19 మున్సిపాల్టీల్లో నామినేషన్లను తిరిగి దాఖలు చేయించే అంశం పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి సూచన చేసింది. ఫలితంగా ఎన్నికల సంఘం నామినేషన్ల తేదీ తో పాటుగా పోలింగ్, కౌంటింగ్ తేదీలను రీషెడ్యూల్ చేసింది.

తిరిగి తిరుపతి, కడప, రాజంపేట లో పలు వార్డులతో పాటుగా మైదుకూరులో తిరిగి నామినేషన్లకు అవకాశం కల్పించింది. తాము 19 మున్సిపాల్టీల్లో జరిగిన ఘర్షణలు.. ఆధారాలు కోర్టుకు సమర్పించగా.. ఎన్నికల సంఘం మిగిలిన మున్సిపాల్టీల్లో అవకాశం ఇవ్వకపోవటం పైన వైసీపీ సీరియస్ అవుతోంది. దీంతో, మరోసారి సుప్రీంలో తమ వాదనలు వినిపించాలని నిర్ణయించింది.
ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న జరగాల్సిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1వ తేదీకి మారింది. అదేవిధంగా అక్టోబర్ 30న నిర్వహించాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 3న జరగనుంది. న్యాయస్థానం ఆదేశాలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
కాగా.. వైసీపీ మరోసారి 19 ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఇవ్వలేదని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 27న సుప్రీంలో విచారణ ఉండటంతో.. ముందుగానే ఈ పిటీషన్ పైన తమ వాదనలు వినాలని వైసీపీ కోరుతోంది. నామినేషన్లు స్వీకరించని ప్రాంతాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించి న్యాయపోరాటం కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో.. సుప్రీంలో చోటు చేసుకునే పరిణామాలతో మున్సిపల్ ఎన్నికల పైన ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications
