టీడీపీ నిర్వాకం- కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వైసీపీ

తిరుపతి: ఏపీ రాజకీయాల్లో బోగస్ ఓట్లు, నకిలీ ఓటర్ల జాబితా.. కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం సహా పలు స్థానాల్లో నకిలీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని తేల్చింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

కుప్పం నియోజకవర్గం పరిధిలో నకిలీ ఓటర్ల కారణంగానే చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తోన్నారనే అభిప్రాయానికి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు వైసీపీ నాయకులు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

YSRCP

ఒక్క కుప్పం నియోజకవర్గం పరిధిలోనే 40 వేలకు పైగా దొంగఓట్లు ఉన్నట్లు వైసీపీ గుర్తించింది. ఈ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్నతమిళనాడు, కర్ణాటక గ్రామాలకు చెందిన వారి పేర్లను ఇందులో చేర్చారనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. ఇలాంటి నియోజకవర్గాలను గుర్తించి దొంగఓట్లను తొలగించాలంటూ ఈసీని కలవబోతోన్నారు.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే విషయంపై స్పందించారు. నకిలీ ఓటర్ల బాగోతాన్ని త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 90 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 60 లక్షలు నకిలీవేనని ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. 2018-2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఓటర్ల జాబితాలో చేర్చారని అన్నారు.

వాటిమీద చర్యలు తీసుకుంటూ ఉంటే తమ ఓట్లను తీసేస్తోన్నారంటూ టీడీపీ నాయకులు వితండవాదంతో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ 60 లక్షల దొంగఓట్లను కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్తామని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+