పొత్తులు, సానుభూతి లెక్కల వేళ - సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన(TDP - Janasena) పొత్తుతో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. బీజేపీ(BJP)తో పవన్(Pawan) కటీఫ్ చెప్పినట్లే. ఢిల్లీ నేతల నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. అటు చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ(TDP)లో కొంత అనిశ్చితి కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ సానుభూతి కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan)మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల మధ్యనే పార్టీ నేతలు ఉండేలా నిర్ణయించారు.

పొత్తుల లెక్కలతో : చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో ఉన్న పరిస్థితులను పవన్ పెడన సభలో చెప్పుకొచ్చారు. టీడీపీ బలహీనంగా ఉందన్నారు. టీడీపీ అనుభవం..జనసేన దూకుడు కలిస్తే జగన్ పైన విజయం సాధ్యమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పవన్ యాత్రలు కొనసాగుతున్నాయి. అటు చంద్రబాబు కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.

YSRCP to Launch Why AP Needs Jagan programme to reach out the people soon

రెండు పార్టీలతో పాటుగా వామపక్ష పార్టీలు కూడా జత కలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు సర్వే నివేదికలతో అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రభుత్వం...పార్టీ ప్రతినిధులు ప్రజల మధ్యనే ఉండేలా నిర్ణయాలు చేస్తున్నారు.

ప్రజల మధ్యనే ఉండేలా: ఇప్పటికే జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమం ప్రారంభం అయింది. ష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 రోజుల పాటు అధికారులు, పార్టీ నేత‌లు స‌మ‌న్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లేలా ఈ కార్యక్రమం రూపక‌ల్పన చేసారు. దీనిద్వారా ప్రతి ఇంటిలో అంద‌రి ఆరోగ్య ప‌రిస్థితిపై రిపోర్టులు సిద్దం చేస్తున్నారు.

అవ‌స‌రం ఉన్నవారికి వైద్య ప‌రీక్షలు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండ‌గానే అక్టోబ‌ర్ 11 నుంచి వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. పార్టీల‌క‌తీతంగా ప్రజ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించామ‌ని చెప్పుకొస్తున్నారు. దీంతో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం రూప‌క‌ల్పన చేసారు.

YSRCP to Launch Why AP Needs Jagan programme to reach out the people soon

ఎన్నికలకు సమాయత్తం : ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మ‌రోసారి ముఖ్యమంత్రిగా జ‌గ‌న్ ఎందుకు రావాల‌నే క్యాంపెయిన్ నిర్వహించున్నారు. గ‌త నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జ‌రిగిన సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం వంటి అన్ని అంశాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రించేలా ప్రతీ ఇంటికి వెళ్లి వారితో మమేకం అయ్యేలా కార్యక్రమం రూపకల్పన చేసారు.

ప్రభుత్వం చేసిన సంక్షేమం, ఒక్కో కుటుంబానికి అందిన ల‌బ్ది వివ‌రాలు అందించ‌డంతో పాటు గ‌త ప్రభుత్వంలో ఎలాంటి ప‌థ‌కాలు అందాయ‌నే దానిపై కూడా ప్రజ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. ఇంత సంక్షేమం, అభివృద్ది గతంలో ఎప్పుడూ జరగలేదని..కొనసాగాలంటే మ‌రోసారి జ‌గ‌న్ అవసరం ఏపీకి ఉందని వివరించటమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీని ద్వారా పూర్తిగా తాను నమ్ముకున్న పాజిటివ్ ఓట్ బ్యాంక్ ను సుస్థిరం చేసుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+