వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమలాపురం విధ్వంసం వెనుక - టీడీపీ..జనసేన : ఆధారాలు ఇవే - బయటపెట్టిన వైసీపీ...!!

|
Google Oneindia TeluguNews

అమలాపురం విధ్వంసం వెనుక ఎవరున్నారు. సూత్రధారులు - పాత్రాధారులు ఎవరు. దీని పైన ఏపీ పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసారు. దాదాపు వేయి మందిని విధ్వంసంలో భాగ్వాములుగా గుర్తించారు. నాటి వాట్సప్ సందేశాలతో పక్కా ప్రణాళికాబద్దంగా విధ్వంసం జరిగిందని పోలీసుల గుర్తించారు. అనేక మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..వారి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. మరి కొంత మందిని అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. ఘటన జరిగిన తరువాత ఈ విధ్వంసం వెనుక టీడీపీ - జనసేన ఉందంటూ హోం మంత్రి ఆరోపించారు.

దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ నేతలే తమ మంత్రి..ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టి... కులాల మధ్య చిచ్చు పెట్టారంటూ ప్రతి విమర్శలకు దిగారు. ఇక, నాటి వీడియో ఫుటేజ్.. సీసీ కేమేరాలు.. ఇంటలిజెన్స్..ఎస్సీ సమాచారంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ నిందితులను పట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ పలు ట్వీట్లు చేసింది. విధ్వసంలో పాల్గొన్న వారి ఫొటోలను విడుదల చేసింది. అందులో టీడీపీ - జనసేన నేతలు ఉన్నారంటూ వారి పేర్లతో ట్వీట్లలో ఆరోపించింది. వారి ఫొటోలు.. పేర్లను ట్వీట్ లో జత చేస్తూ.. అమలాపురం విధ్వంసం వెనుక జనసేన, టీడీపీ.. ఇవిగో ఆధారాలు అంటూ ట్వీట్ చేసింది.

YSRCP Tweets on Amalapuram Violence, alleged TDP and Janasena behind this conspiracy

అమలాపురంలో అశాంతికి దారితీసిన కుట్రలు బట్టబయలు.. వాట్సప్ గ్రూపుల ద్వారా జనసేన, టీడీపీ కార్యకర్తల ధ్వంస రచన అంటూ మరో ట్వీట్ లో వాట్సప్ లో చోటు చేసుకున్న సంభాషణలు.. సర్క్యులేట్ అయిన సందేశాలను ప్రస్తావించింది. పచ్చటి కోనసీమలో అరాచకశక్తులు. పక్కా ప్రణాళికతో అల్లర్లను ప్లాన్ చేసి జనసేన, టీడీపీ అంటూ వైసీపీ తన అధికారిక ట్విట్టర్ లో మరో పోస్టింగ్ చేసింది. పోలీసులు కుట్రలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. వారు వెనుక ఏ పార్టీ అన్నదాని కంటే..ముందుగా విధ్వంసానికి పాల్పడిన వారి విషయంలో మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వారైన వదిలేది లేదని చెబుతున్నారు.

అయితే, వైసీపీ కార్యకర్తలు..కింది స్థాయి కార్యకర్తలు ఇందులో భాగస్వాములంటూ టీడీపీ ఆరోపిస్తోంది. నాటి ఘటన పైన టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మహానాడు వేదికగా పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇక, వైసీపీ ట్వీట్ చేసిన ఫొటోలతో పార్టీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి మరో ట్వీట్ లో టీడీపీని టార్గెట్ చేసారు. మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సైతం టీడీపీని కార్నర్ చేసారు. విధ్వంసం చేసిన వారు టీడీపీ - జనసేనకు సంబంధించిన వారనేనని ఆరోపించారు, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ రకంగా డెవలప్ చేయాలా అని ప్రయత్నిస్తుంటే..టీడీపీ - జనసేన కులాలు - మతాల మధ్య చిచ్చు పెట్టి విధ్వంసాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ చేసిన ట్వీట్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

English summary
YSRCP Tweets on Amalpuram violence with photos, Alleged that TDP and Janasean leaders participated in this violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X