ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం: వినుకొండలో వైసీపీ నేత దారుణహత్యపై
Vinukonda Murder: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో సంభవించిన వరుస హత్యలు, అత్యాచార ఘటనలను రాష్ట్రపతికి వివరించాలని నిర్ణయించింది.

వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్‌ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన పట్ల వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక శాంతి భద్రతలు కరవయ్యాయని విమర్శించింది. రోజుకో హత్య, అత్యాచార ఘటనలు సంభవిస్తోన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వినుకొండలో పార్టీ నాయకుడు షేక్ రషీద్ హత్యోదంతం.. దీనికి పరాకాష్టగా పేర్కొంది.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అయిన రషీద్ హత్యకు సంబంధించిన వీడియో క్లిప్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది వైఎస్ఆర్సీపీ. ఈ హత్య వెనుక గల కారణాలను వివరించింది.
Good morning, Madam @rashtrapatibhvn! It’s a very bad morning here in Andhra Pradesh. 💔
— YSR Congress Party (@YSRCParty) July 18, 2024
We are seeking support from every Indian and need your kind intervention and SAVE the people of Andhra Pradesh. 🙏🏻
We are also part of INDIA. 🇮🇳#SaveAndhraPradesh pic.twitter.com/yjXzugFBSp
తెలుగుదేశం- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నుంచి ఏపీని కాపాడాలంటూ విజ్ఞప్తి చేసింది. భారత్‌లో ఏపీ కూడా ఓ భాగమేనని గుర్తు చేస్తోన్నామని పేర్కొంది. ఈ దారుణ హత్యాకాండలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతిని అభ్యర్థించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మానవ హక్కుల సంఘాలు, వివిధ జాతీయ న్యూస్ ఛానళ్లకు దీన్ని పంపించింది.












Click it and Unblock the Notifications