రెండేళ్లు 'ఆమె' ఇంటిచుట్టూ తిరిగిన ఎమ్మెల్యే మేకపాటి?
తనకు 15 సంవత్సరాల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో వివాహమైందని, ఆయనకు ఇష్టం లేకపోవడంతో తనను రెండు సంవత్సరాలకే వదిలేసి వెళ్లిపోయారని శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీ దేవి వెల్లడించారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినంటూ శివచరణ్ రెడ్డి లేఖ రాయడంతోపాటు సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
లక్ష్మీదేవిని భర్త వదిలేసి వెళ్లిపోయిన తర్వాత ఆశ్రయం కోసం ఆమె పిన్ని దగ్గరకు వెళ్లింది. ఒకరోజు ఆమె మామ, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుకుంటుండగా ఆమె విషయం చర్చకు వచ్చింది. అమ్మాయి జీవితం నాశనమైందని లక్ష్మీదేవి మామ బాధపడుతుండటంతో తనను పెళ్లి చేసుకుంటానని, ఇంటికి తీసుకువెళతానని మేకపాటి నమ్మించారు. వాళ్ల ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయేసరికి రెండు సంవత్సరాల ఆమె ఇంటిచుట్టూనే తిరిగాడు. పెళ్లి చేసుకొని బెంగళూరులో కాపురం పెట్టామని, 18 సంవత్సరాలు తమతోనే ఉన్నారని, బాబు శివచరణ్ రెడ్డి బాగా చూసుకునేవారని లక్మీదేవి చెప్పారు.

ప్రస్తుతం చంద్రశేఖర్‌రెడ్డితో ఉన్న శాంతకుమారి పరిచయమవడంతో తమ ఇంటికి రావడం తగ్గించారని, అది తెలిసి తాము మందలించడంతో పూర్తిగా ఇంటికి రావడమే మానేశారని చెప్పారు. ఇప్పుడేమో తాము డబ్బుకోసం వచ్చామని చెబుతున్నారని, అబద్దాలు ఆడుతూ అవమానిస్తున్నారని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి నుంచి మేం కష్టాలు పడుతూనే ఉన్నామని, ఇంట్లోంచి తీసుకొచ్చి బజారుపాలు చేసినా ఒక్కమాట అడగలేదని, చేస్తున్న అవమానం భరించలేకే బయటకు రావాల్సి వచ్చిందన్నారు. డబ్బుల కోసం వచ్చామని మాట్లాడుతున్నారని, ఎవరి దగ్గర ఎంత డబ్బుందో చూసుకుందాం రమ్మన్నారు.












Click it and Unblock the Notifications