వక్ఫ్ చట్టం స్టేటస్ కోను స్వాగతించిన వైసీపీ..! బెజవాడలో సంబరాలు..!
వివాదాస్పద వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో విధిస్తూ ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ముస్లిం వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పెద్ద ఊరటగా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలు సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడతో పాటు పలు నగరాల్లోని మసీదుల వద్ద ముస్లింలు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను పిటిషనర్ గా ఉన్న వైసీపీ కూడా స్వాగతించింది.
వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్వార్ధ రాజకీయాల కోసం ముస్లిం, మైనార్టీలను అన్యాయం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు.

వక్ఫ్ (సవరణ)చట్టం 2025ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిందని, దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారని, తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని చెప్పారన్నారు. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసిందని హఫీజ్ ఖాన్ తెలిపారు. ఇది తమ ముస్లిం సమాజానికి గొప్ప రిలీఫ్ అన్నారు.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్దంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దశలోనూ అడ్డుకుందని హఫీజ్ ఖాన్ తెలిపారు. దీనిపై సుప్రీంలో తప్పకుండా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సీజేఐ లేవనెత్తిన అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయన్నారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో సీజేఐ సొలిసిటర్ జనరల్‌ను అడిగిన ప్రశ్నలే తాము ముందు నుంచి అడిగామన్నారు. ప్రభుత్వానికి సుప్రిం ఇచ్చిన నిర్ణీత గడువులో వారు సమాధానం ఇవ్వాలన్నారు.

టీడీపీ మాత్రం స్వార్ధ రాజకీయాలు చేసి తడిగుడ్డతో ముస్లిం, మైనార్టీల గొంతు కోసిందని హఫీజ్ ఖాన్ ఆరోపించారు. వీరి స్వార్ధ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోందన్నారు.కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని ముస్లింలు అంతా కూడా చంద్రబాబు, నితీష్‌కుమార్‌ల వైపు చూశారని, తమ హక్కులు అణగదొక్కుతుంటే తమ వైపు నిలవకుండా వీరిద్దరూ బీజేపీ అజెండాను దేశమంతా అమలుచేయడానికి పూర్తిగా సహకరించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలన్నారు. ఆయనపై ఆ బాధ్యత ఉందన్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications