వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YSRCP Job mela: ఈ రెండు యూనివర్శిటీల్లో.. తేదీలివే: తిరుపతిలో గ్రాండ్ సక్సెస్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాదిమందికి ఉద్యోగాలు లభించాయి. వారి విద్యార్హతకు తగ్గట్టుగా మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర యూనివ‌ర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. ఇది మొదటిది. రాయ‌ల‌సీమ‌ జిల్లాలకు చెందిన నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి.

ఈ జాబ్ మేళాలో శనివారం 147 కంపెనీలు పాల్గొన్నాయి. ఆదివారం కూడా ఈ జాబ్ మేళా కొన‌సాగ‌నుంది. తొలి రోజే 4,784 మందికి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ఎల్‌జీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, కియామోటార్స్ వంటి 147 కంపెనీలు పాల్గొన్నాయి. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పించాయి. ఇవ్వాళ కూడా ఈ జాబ్ మేళా ఎస్వీ యూనివర్శిటీ క్యాంపస్‌లోనే కొనసాగుతోంది. తొలి రోజు తరహాలోనే ఇవ్వాళా భారీ ఎత్తున నియామకాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

ఇది సక్సెస్ కావడంతో మరో రెండు చోట్లా జాబ్ మేళాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోన్నారు వైసీపీ నాయకులు. ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నిరుద్యోగుల కోసం దీన్ని నిర్వహించనున్నారు. తిరుపతిలో నిర్వహిస్తోన్న కార్యక్రమం కంటే అధికంగా ఆంధ్రా యూనివర్శిటీ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి స్పందన లభిస్తుందని అంచనా వేస్తోన్నారు.

YSRCP will conduct Job mela at Vizags Andhra University and Gunturs Nagarjuna, Check the dates here

దీనితో పాటు గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లోనూ వైసీపీ జాబ్ మేళా ఏర్పాటు కానుంది. ఈ నెల 30, మే 1వ తేదీల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసింది. ఈ మూడు ప్రతిష్ఠాత్మక క్యాంపస్‌ల ద్వారా కనీసం 20 నుంచి 25 వేల మంది అర్హులకు, వారి విద్యార్హతలకు తగ్గట్టుగా ఎంఎన్సీల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతిలో జాబ్ మేళ సక్సెస్ అయిందని, మిగిలిన ఈ రెండు యూనివర్శిటీల్లోనూ అదే తరహాలో స్పందన లభిస్తుందని పేర్కొంటున్నాయి.

జాబ్ మేళాలో హాజరు కాదలిచిన అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వైసీపీ ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://ysrcpjobmela.com/లో విద్యార్హత సహా ఇతర వివరాలన్నింటినీ రిజిస్టర్ చేసుకోవాలి. దీని ఆధారంగానే జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల ప్రతినిధులు.. వారికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

English summary
YSR Congress Party will conduct Job mela at Andhra University at Visakhapatnam on 23 24 of this month and Guntur's Nagarjuna University on April 31st and May 1st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X