షర్మిల నో చెప్పలేదు: టిపై జగన్ పార్టీ, విలీనం పైనా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిల నో చెప్పలేదట! తెలంగాణలో పార్టీ బాధ్యతలను చేపట్టేందుకు షర్మిల నిరాకరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వైయస్సార ్కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణలో పార్టీ బాధ్యతలను షర్మిల తిరస్కరించారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి బాధ్యతలు స్వీకరించడానికైనా షర్మిల సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే పార్టీ విలీనం కోసం కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుందనే అంశం పైనా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీలో ఎన్నిటికీ కలవదని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
తెరాసపై మోత్కుపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా మండిపడ్డారు. రైతుల జీవితాలతో కెసిఆర్ ఆడుకుంటున్నారని, ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా దానికి కెసిఆరే బాధ్యుడని హెచ్చరించారు. మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు రైతులందరికీ రుణ మాఫీ చేయడానికి కెసిఆర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications