వైసీపీ ఏడో జాబితాపై ట్విస్ట్..!
YSRCP 7th list: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 85 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.
ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. పలుచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు.

మరో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు సాగిస్తోంది వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం. నేడో, రేపో ఈ లిస్ట్ విడుదల కావొచ్చు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకం, కీలకంగా మారిన నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది.
ఏడో విడత జాబితా కసరత్తుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. త్వరలోనే తుది జాబితా విడుదల అవుతుందని స్పష్టం చేశారు. మరో జాబితా ఉండకపోవచ్చని అనుకోవట్లేదని చెప్పారు.
ఇప్పటి వరకు ఆరు విడతల్లో చేపట్టిన అభ్యర్థుల కేటాయింపులు, ఇన్‌ఛార్జీల నియామకాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండొచ్చని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ తుది జాబితా వెలువడుతుందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
చివరి జాబితా విడుదలైన తరువాత మార్పులు చేర్పులు చేయాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు. భారీ స్థాయిలో మార్పులేవీ ఉండబోవని, చాలావరకు అవన్నీ పూర్తయ్యాయని వివరించారు. చివరి విడత జాబితాను విడుదల చేయడానికి ఎక్కువ సమయం తీసుకోదలచుకోలేదని, త్వరలోనే వెలువడుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications