బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే చురకలు

Kothari Abbaya Chowdary: రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, సభా కార్యకలాపాలను అడ్డుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు కొఠారి అబ్బయ్య చౌదరి.. ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. టీడీపీ సభ్యుడు నందమూరి బాలకృష్ణ విజిల్ వేయడాన్ని తప్పుపట్టారు. తొడలు కొడితేనో, విజిల్స్ వేస్తేనో కుర్చీలు కదలవని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలంటే ప్రజల ఆశీర్వద బలం ఉండాలని అన్నారు.

YSRCPs MLA Kothari Abbaya Chowdary slams at TDP

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో అబ్బ‌య్య చౌద‌రి మాట్లాడారు. స్పీకర్‌ స్థానం వద్దకు వచ్చి ఆందోళన చేయడం అనైతికమ‌ంటూ మండిప‌డ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజల కోసం ప్రభుత్వం చేసిన, వారికి తెలియ జేయాల్సిన విషయాలను పక్కదోవ పట్టించడానికే టీడీపీ సభ్యులు ఇలా సభా కార్యకలాపాలను అడ్డుకుంటోన్నారని విమర్శించారు.

టీడీపీ సభ్యులు స్పీకర్‌పై దాడికి దిగడం.. వారి విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమ‌ని కొఠారి అబ్బయ్య చౌదరి ఆరోపించారు. నోటికి వచ్చిన మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమ‌ర్శించారు. తమ ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం కూడా పేదల కోసమేనని, వాటిపై విమర్శలు, ఆరోపణలు చేయడం టీడీపీకి మాత్రమే దక్కిందని మండిపడ్డారు.

నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మార్చివేశామని, చిన్న పిల్లలకు మేనమామలా, కుటుంబంలో వ్యక్తిగా జగన్‌ అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారని చెప్పారు. వైద్య రంగాన్ని ప్రతీ పేదవాడికి చేరువ చేస్తోన్నమని, దీనికోసం ఆరోగ్యశ్రీని కవరేజీని 25 లక్షల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+