వైసీపీ నా పార్టీ- నా చేతులతో నిర్మించా: పిల్లి సుభాష్

అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసంతృప్తి.. చల్లారినట్టే కనిపిస్తోంది. ఈ అసంతృప్తికి కారణమైన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవ్వాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలను వివరించారు.

అనంతరం తాడేపల్లి నుంచి రామచంద్రాపురానికి చేరుకున్నారు. తన అనుచరులతో సమావేశం అయ్యారు. వైఎస్ జగన్‌తో భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను వివరించారు. తాను పార్టీని వీడబోతోన్నానంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. జనసేన గానీ.. మరో పార్టీలో గానీ చేరట్లేదంటూ తేల్చి చెప్పారు.

pillisubhashchandrabose1

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలో కొనసాగుతున్నానని, పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు. పార్టీ నిర్మాణంలో ఓ పిల్లర్‌గా నిలిచానని వ్యాఖ్యానించారు. అందుకే- జిల్లా పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలను జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.

వైసీపీ తన సొంత పార్టీ అని.. తన చేతులతో దీన్ని నిర్మించానని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకూ తనకు ఏ లోటూ రానివ్వలేదని, చాలా గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. ఎలాంటి వినతిపత్రాలను అందజేసినా.. వాటిని నెరవేర్చారని వివరించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత అవసరాలు లేవని, ప్రజల కోసమే పని చేశానని పేర్కొన్నారు.

pillisubhashchandrabose1

రాజకీయ పార్టీలకు గుమ్మాలు, ద్వారాలు ఉండవని, ఎవరైనా యథేచ్ఛగా ఎవరైనా వస్తుంటారు.. పోతుంటారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు పిల్లి సుభాష్. కొన్ని కొన్ని అనుకున్నవి జరగక్కపోవచ్చని, అలాంటి సందర్భాలు తనకు ఎదురైనా గానీ బాధపడలేదని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీస్తున్నప్పుడు.. వారిని మనుషుల్లాగా కూడా చూడనప్పుడు బాధ కలుగుతుంటుందని, దాని గురించే మాట్లాడానని వివరించారు.

రామచంద్రాపురంపై వైఎస్ జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని, ఆయన హామీ ఇచ్చారని పిల్లి సుభాష్ చెప్పారు. కార్యకర్తలకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణానికి, కృషికి పని చేయాలని ఆయన తన అనుచరులకు సూచించారు. రామచంద్రాపురంలో ఎవరిని అభ్యర్థిగా నిలిపినా తనకు అభ్యంతరం లేదని, జగన్ నుంచి పాజిటివ్ నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+