లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ వేయండి - హైకోర్టులో వైసీపీ..!!
తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీని పైన టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు.
హైకోర్టులో లంచ్ మోషన్
తిరుమల లడ్డూ ప్రసాదం పైన తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లడ్డూ ప్రసాదంలో జంతవుల ఫ్యాల్ కలిపారంటూ ఆరోపించారు. తాజాగా లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో వాడిన పదార్ఢాల పైన ల్యాబ్ రిపోర్టును టీడీపీ నేత ఆనం బయట పెట్టారు. అందులో విస్తు పోయే అంశాలను వెల్లడించారు. దీంతో, భక్తుల్లో ఆగ్రహం మొదలైంది. ఇక..చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి స్పందించారు.

విచారణ చేయించాలి
చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి తాను ఎలాంటి పొరపాటు జరగలేదని దేవ దేవుడి సాక్షిగా తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ప్రమాణం చేయటానికి సిద్దమని ప్రకటించారు. చంద్రబాబు అందుకు సిద్దమా అంటూ ప్రశ్నించారు. భూమన సైతం రియాక్ట్ అయ్యారు. రాజకీయాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎవరైనా శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేసి ఉంటే సర్వనాశనం అవుతారని వ్యాఖ్యానించారు. తాజాగా బయటకు వచ్చిన ల్యాబ్ రిపోర్టు పైన భూమన స్పందించారు.
నిజం నిగ్గు తేల్చాలి
ఇక తాజాగా వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. సుబ్బారెడ్డి తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని..నిజం నిగ్గు తేల్చాలని పిటీషన్ లో కోరారు. పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక, ఈ మధ్నహ్నం మాజీ సీఎం జగన్ ఈ వ్యవహారం పైన స్పందించనున్నారు.












Click it and Unblock the Notifications