జగన్ మాట చెబితే చాలు, కానీ: రాజీనామాలపై వైవీ తేల్చేశారు

Subscribe to Oneindia Telugu

న్యూ ఢిల్లీ: తమ పార్టీ ఎంపీల రాజీనామా అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ఎంపీ సుబ్బారెడ్డి కలిశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏం చేయడానికైనా తాము సిద్ధమని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత జగన్ రాజీనామా చేయమంటే వెంటనే రాజీనామా చేస్తామన్నారు. అయితే ఇప్పుడు రాజీనామా చేయడంలో అర్థం లేదన్నారు.

yv subba reddy on MPs resignation issue

తాము రాజీనామా చేస్తే.. పార్లమెంట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మాట్లాడేవారే ఉండరన్నారు. ప్రత్యేక హోదాకోసం ఉద్యమాన్ని ఉదృతం చేసి ఆ తరువాత రాజీనామా చేస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయపడ్డారు. ఏపీకిప్రత్యేక హోదా కోరుతూ తమ పార్టీ ఎంపీలు మూకుమ్మడి రాజీనామా చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించి విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MP YV Subba Rao on Tuesday responded on his party MPs resignation issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి