వైసీపీ గెలిచే సీట్లు ఎన్నంటే ?- వైవీ సుబ్బారెడ్డి లెక్క ఇదే- జగన్ ప్రమాణం ముహుర్తం ఖరారు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గెలుపుపై తమదైన శైలిలో లెక్కలు వేసుకుంటున్నాయి. అధికార వైసీపీతో పాటు విపక్ష కూటమిలో పార్టీలు కూడా గెలుపుపై భారీగా అంచనాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మరోసారి గెలువబోతున్నట్లు ఊ మధ్యే తేల్చిచెప్పేశారు. దీనికి కొనసాగింపుగా మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే నెల 9న విశాఖలో సీఎం జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్పారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఇవాళ స్పందించారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లతో గెలవబోతోందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ జోస్యం చెప్పారు. జగన్ ఇప్పటికే చెప్పినట్లు విశాఖలో వచ్చే నెల 9న ఉదయం 9.30కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వైవీ వెల్లడించారు. ఈనెల 13వ తేదీన జరిగిన పోలింగగ్ లో ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, మైనార్టీలు, గిరిజనులు వైయస్సార్సీపి పార్టీకి ఓటువేశారని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు.

తాజాగా సీఎం జగన్ తమకు గతంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన 151 సీట్ల విజయం కంటే భారీ విజయం లభించబోతోందని కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ ఆఫీసులో వెల్లడించారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఆ సంఖ్యను కుదించి 150 సీట్లలో గెలుస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వైసీపీ అంచనాలను బట్టి కనీసం 120 సీట్లలో గెలువబోతున్నట్లు అంచనాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు విజయంపై ఎంత ధీమాగా ఉన్నారో అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications