వాడి వేడిగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశాలు
అమరావతి: శ్రీకాకుళం జల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ లక్ష్మీ నరసింహాం ఈ సమావేశాలకు హాజరు కానప్పటికీ మిగిలిన ఫోరం హాజరు కావడంతో జెడ్పీ ఛైర్ పర్సన్ ధనలక్ష్మీ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశాలను యధావిధిగా నిర్వహించారు.సుమారు గంట ఆలస్యంగా ప్రారంభించిన ఈ సమావేశాల్లో 58 శాఖల పనితీరుపై చర్చించాల్సి ఉన్నప్పటికీ, కేవలం ఆరు శాఖలకే చర్చ పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా సర్వ సభ్య సమావేశాలు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications