బ్లాక్ బస్టర్ సండే: భారత్‌కు డేంజర్ బెల్స్: పీక్స్‌లో పాకిస్తాన్: సూపర్ 4 షెడ్యూల్ ఇదే

దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్‌లో ఇవ్వాళ్టి నుంచి సూపర్ 4 దశ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ రౌండ్‌లో గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4కు చేరుకున్నాయి. బంగ్లాదేశ్, హాంకాంగ్ టోర్నీ నుంచి వైదొలిగాయి.

టీమిండియా షెడ్యూల్ ఇదే..

టీమిండియా షెడ్యూల్ ఇదే..

సూపర్ 4లో ఈ నాలుగు జట్లు కూడా మూడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడతాయి. టీమిండియా తొలుత పాకిస్తాన్, అనంతరం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆదివారం షెడ్యూల్ అయింది. 6వ తేదీన శ్రీలంకతో తలపడుతుంది. 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది.

రెండో దశలో..

రెండో దశలో..

ఆదివారం జరిగే సూపర్-4 రెండో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. సరిగ్గా వారం రోజుల తరువాత వీటి మధ్య జరిగే రెండో మ్యాచ్ ఇది. గత ఆదివారం ఆసియా కప్ గ్రూప్ దశలో ఈ రెండు దేశాలు తలపడ్డాయి. తన చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా ఏకపక్షంగా విజయాన్ని సాధించింది. అయిదు వికెట్ల తేడాతో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్‌ను మట్టి కరిపించింది. ఇప్పుడిక రెండో రౌండ్‌లో మరోసారి పాక్‌తో బిగ్ ఫైట్‌కు సన్నద్ధమౌతోంది.

కోలుకున్న పాక్..

కోలుకున్న పాక్..

భారత్‌పై పరాజయం పాలైన తరువాత పాకిస్తాన్ కోలుకుంది. తన రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తు చిత్తు చేసింది. వార్ వన్‌సైడ్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా కమ్‌బ్యాక్ అయింది పాక్. షార్జా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ కమ్ కేప్టెన్ బాబర్ ఆజమ్ తొమ్మిది పరుగులకే పెవిలియన్ చేరాడు.

చెలరేగిన బ్యాటర్లు..

చెలరేగిన బ్యాటర్లు..

మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీలో కదం తొక్కారు. 57 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో రిజ్వాన్ 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 41 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో జమాన్ 53 పరుగులు చేసి ఎహ్‌సాన్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఖుష్దిల్ షా సిక్సర్ల మోత మోగించాడు. 15 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

38 పరుగులకే..

38 పరుగులకే..

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌ బ్యాటింగ్ ఆర్డర్‌ను పాకిస్తాన్ బౌలర్లు చెల్లాచెదరు చేశారు. 38 పరుగులకే కుప్పకూల్చారు. బౌలర్ల ధాటికి 155 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. ఆ కాసిన్ని పరుగులకే జట్టు మొత్తం ఆలౌట్ అయిందంటే- పాక్ బౌలర్ల జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ బౌలర్ కూడా ఏడుకు మించి పరుగులు ఇవ్వలేదు. షాదాబ్ ఖాన్-4 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ నవాజ్-3, నసీం షా-2, షానవాజ్ దహని ఒక వికెట్ నేల కూల్చారు.

హాంకాంగ్‌పై..

హాంకాంగ్‌పై..

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ఈ రేంజ్‌లో చెలరేగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీమిండియాకు డేంజర్ బెల్స్ మోగించినట్టయింది. పాకిస్తాన్ చేతిలో 38 పరుగులకు కుప్పకూలిన ఇదే హాంకాంగ్ జట్టు.. గ్రూప్ దశలో భారత్‌పై 152 పరుగులు చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్ జట్టును ఆలౌట్ చేయలేకపోయారు టీమిండియా బౌలర్లు. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య ఉన్న తేడాను బట్టి చూసుకుంటే.. పాకిస్తాన్‌ దూకుడుగా ఉన్నట్టే.

బ్లాక్ బస్టర్ సండే..

బ్లాక్ బస్టర్ సండే..

సూపర్ 4లో భాగంగా ఆదివారం సాయంత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు దూరం అయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కిందిటి ఆదివారం తరహాలోనే పాకిస్తాన్‌పై మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చుతుందా? లేక చెమటోడుస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+