బుమ్రా సహా ఆ అయిదుమంది ప్లేయర్లపై బీసీసీఐ కీలక ప్రకటన
ముంబై: క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. శుభవార్త చెప్పింది. సుదీర్ఘకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తోన్న అయిదుమంది ప్లేయర్ల పునరాగమనంపై అప్‌డేట్స్ ఇచ్చింది. గాయం వల్ల చాలాకాలంంగా క్రికెట్ ఆడలేకపోయిన నలుగురు ప్లేయర్లు త్వరలో జట్టులోకి రాబోతోన్నారని పేర్కొంది. వారంతా రిహాబిలిటేషన్ చివరి దశలో ఉన్నారని తెలిపింది.
ఆ అయిదుమంది- స్టార్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్. రిషభ్ పంత్ మినహా మిగిలిన ప్లేయర్లందరూ నెట్స్‌లో పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేస్తోన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్ నెట్స్‌కు తిరిగి వచ్చాడు. ఇప్పుడిప్పుడే గ్లోవ్స్ ధరిస్తోన్నాడు.

జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా 10 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో అతను గాయపడ్డాడు. అప్పటి నుంచీ మ్యాచ్‌లను ఆడట్లేదు. ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లోనూ కనిపించలేదు.
గత ఏడాది ఆగస్టులో టీమిండియా.. జింబాబ్వేలో పర్యటించిన సమయంలో ప్రసిద్ధ్ కృష్ణ గాయపడ్డాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్-ఏతో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ- గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి కూడా అంతే. గాయం వల్ల ఐపీఎల్ సీజన్ నుంచి వారిద్దరూ తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం వారంతా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉంటోన్నారు. వారందరి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ తాజా అప్‌డేట్స్ ఇచ్చింది. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు తమ రిహాబిలిటేషన్ చివరిదశలో ఉన్నారని తెలిపింది. బౌలింగ్‌లో తమ పూర్తి రిథమ్‌ను అందిపుచ్చుకున్నారని, కొన్ని ప్రాక్టీస్ గేమ్‌లను ఆడటానికి అనుమతి ఇచ్చామని వివరించింది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లన్నీ ఎన్సీఏ నిర్వహిస్తుంది. వారి ఫిట్‌నెస్ రిపోర్ట్ పూర్తి సంతృప్తికరంగా ఉన్నట్లు బీసీసీఐ మెడికల్ టీమ్ పేర్కొంది. ప్రాక్టీస్ గేమ్స్ తరువాత వారి ఫిట్‌నెస్‌పై అంచనా వేస్తామని పేర్కొంది. జట్టులో పునరాగమనంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది బీసీసీఐ.

వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ కూడా కోలుకున్నాడు. గాయానికి శస్త్రచికిత్సను చేయించుకున్నాడు. గాయం వల్ల మార్చిలో అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. మేలో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉంటోన్నాడు.
కేఎల్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్.. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తోన్నారని, ఇదివరకట్లా ధాటిగా ఆడగలుగుతున్నారని బీసీసీఐ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్- ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బ్యాటింగ్‌తో పాటు నెట్స్‌లో కీపింగ్ చేయడం ప్రారంభించినట్లు బీసీసీఐ వెల్లడించింది.












Click it and Unblock the Notifications