నాయక్ vs రెడ్డి, పక్కా ప్లాన్ తో లేపేసిన ఫ్యామిలీ, అర్దరాత్రి ఏం జరిగిందంటే?

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు పొరుగు జిల్లా అయిన కోలార్ జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. ఆమె కూతురు మేజర్ కావడంతో వేరే కులానికి చెందిన యువకుడితో ప్రేమాయణం సాగిస్తోందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. కుటుంబ సభ్యుల సలహా వినకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యిందని తెలిసి సొంత కూతురిని చంపి పొలంలో పాతిపెట్టాడు.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలోని కోలార్ తాలూకా తొట్లి గ్రామంలో తండ్రి చేతిలో కూతురు దారుణ హత్యకు గురైయ్యింది. ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున 2. 30 గంటలకు ఆ యువతి హత్యకు గురయ్యిందని పోలీసులు అన్నారు. తండ్రి చేతిలో హత్యకు గురైన కూతురి పేరు రమ్యా(19) అని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం రమ్యా మరో కులం యువకుడితో ప్రేమలో పడింది.

A father who killed his daughter who loved a low caste man and buried her in his own field in Kolar near Bengaluru

హత్యకు గురైన రమ్యా ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందినదని, ఆమె ప్రేమిస్తున్న యువకుడు నాయక్‌ వర్గానికి చెందిన వ్యక్తి అని పోలీసులు అన్నారు. ఆ యువకుడు కూడా పెళ్లి చేసుకునే వయసకు వచ్చాడని పోలీసులు అన్నారు. నాయక్ అనే యువకుడు రమ్యా నివాసం ఉంటున్న పొరుగు గ్రామానికి చెందినవాడు. పక్క గ్రామానికి చెందిన నాయక్ తో తన కుమార్తె రమ్యా ప్రేమ వ్యవహారాలు జరుపుతోందని ఆమె తండ్రి వెంకటేష్ గౌడ్ కు తెలిసింది.

తర్వాత కూతురు రమ్యాను ఇంట్లో కూర్చోబెట్టి ముందుగా వెంకటేష్ గౌడ మెల్లిగా మాట్లాడాడు. తర్వాత ప్రేమను మానుకోవాలని కూతురు రమ్యాను ఆమె తండ్రి వెంకటేష్ గౌడ హెచ్చరించాడు. అయితే ప్రేమను కొనసాగించిన ప్రేమికులు రమ్యా, నాయక్ రాత్రి ఫోన్ లో రహస్యంగా మాట్లాడుకున్నారు. చాలా కాలంగా నాయక్, రమ్యా అర్దరాత్రి పూట ఫోన్ లో మాట్లాడుకుంటున్నారని తెలిసింది.

ఈనెల 25వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటలకు రమ్యా ఆమె ప్రియుడు నాయక్ తో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో నిద్రలేచి కూతురు రూమ్ లోకి వెళ్లిన వెంకటేష్ గౌడ కూతురు రమ్యా ఫోన్ తీసుకుని నీకు వేరే పెళ్లి సంబంధం చూస్తున్నామని, పెళ్లి చేసుకోవాలని కూతురికి చెప్పాడు. నేను నాయక్ ను పెళ్లి చేసుకుంటానని, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రమ్యా ఆమె కుటుంబసభ్యులతో గొడవ పడింది.

ఆ సమయంలో తండ్రి వెంకటేష్ గౌడ ఆగ్రహంతో రమ్యా మెడపై కాలు వేసి ఊపిరాడకుండా చేసి ఆమెను చంపేశారు, హత్య అనంతరం బంధువుల సహకారంతో ఎవరికీ చెప్పకుండా రమ్యా అంత్యక్రియలు చెయ్యాలని చూశాడు. కుమార్తె రమ్యాను హత్య చేసిన వెంకటేష్ గౌడ్ అతని అన్నయ్య మోహన్ గౌడ్ కు, చౌడేగౌడ్, బావమరిది ఆంజనేయరెడ్డి సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.

తమ భూమిలో కుటుంబ సభ్యులు రమ్యాను పూడ్చిపెట్టారు. ఇరుగుపొరుగు వారు ప్రశ్నించినా వెంకటేష్ గౌడ ఏమాత్రం మాట్లాడలేదు. దీంతో స్థానికులకు అనుమానంవచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. కూతురు రమ్యాను హత్య చేసిన ఆమె తండ్రి, హత్యకు సహకరించిన వారితో సహా మొత్తం నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+