Wife: దేవుడు మనిషిని సృష్టిస్తే, మనిషి శాడిస్టును సృష్టించాడు, భార్యకు డ్రగ్స్ ఇచ్చి రొమాన్స్, క్లైమాక్స్!

బెంగళూరు/ఆర్ టీనగర్: దేవుడు మనిషిని సృష్టిస్తే, మనిషి శాడిస్టులు, సైకోలను సృష్టించాడు. ఎవడు ఎప్పుడు ఎలా మారుతాడో ఆ దేవుడికే తెలియాలి. బలవంతంగా ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భార్యకు నిద్రమాత్రలు, మత్తు మందు ఇచ్చి ఆమెతో రొమాన్స్ చేశాడు.

బిడ్డపుట్టిన తరువాత భార్య మీద మోజు తీరిపోవడంతో ఆమెకు నరకం చూపించాడు. అర్దరాత్రి ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లి నడిరోడ్డు మీద వదిలేసిన భర్త శాడిస్టులాగా ప్రవర్తించాడు. ఓపిక నశించిపోయిన భార్య ఆమె భర్తకు చుక్కలు చూపించింది.

భర్త ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన భార్య

భర్త ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన భార్య

తమ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, డబ్బు, ఖరీదైన వాచ్ తో పాటు కట్నం తీసుకురావాలని తన భర్త తన మీద దాడి చేసి ప్రాణాలు తీస్తానని బెదిరించాడని, తన భర్త, అతని కుటుంబ సభ్యులు నాకు నరకం చూపిస్తున్నారని బాధితురాలు బెంగళూరులోని ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.

బెంగళూరులోని దిన్నూరుకు చెందిన 33 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త వజీర్‌ అహ్మద్‌తో పాటు అతని కుటుంబం షాహినా షరీఫ్‌, రుమానాఖాన్‌, మనోరాయనపాళ్యకు చెందిన మొహిసేనాలపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఆర్ టీ నగర్ పోలీసులు తెలిపారు.

బలవంతంగా పెళ్లి

బలవంతంగా పెళ్లి

నిందితుడు వజీర్ అహ్మద్ 2020లో బాధితురాలిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వజీర్ ఏమాత్రం వినకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి, పెళ్లయిన మరుసటి రోజు నుంచి బాధితురాలిని ఆమె భర్త వజీర్, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. పుట్టింటి నుంచి బంగారు నగలు, నగదు కట్నంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. చాలాసార్లు దాడి చేశారు.

భార్యకు మత్తుమందు ఇచ్చి రొమాన్స్

భార్యకు మత్తుమందు ఇచ్చి రొమాన్స్

బలవంతంగా పెళ్లి చేసుకున్న వజీర్ రాత్రిపూటా తనకు రొమాన్స్ లో సహకరించడం లేదని భార్యను చితకబాదుతున్నాడు. తరువాత భర్త వజీర్ అతని భార్యకు నిద్రమాత్రలు మింగించి, మత్తుమందు ఇచ్చి ఆమెతో శృంగారం చేయడంతో ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తరువాత భార్య మీద మోజు తీరిపోవడంతో వజీర్ ఇంకా రెచ్చిపోయాడని తెలిసింది.

భార్య పుట్టింటికి వెళ్లి?

భార్య పుట్టింటికి వెళ్లి?

తన భర్త వజీర్, అతని కుటుంబ సభ్యులు ప్రతినిత్యం వరకట్నం తీసుకురావాలని తనను శారీరకంగా హింసిస్తూనే ఉన్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల హింసను తట్టుకోలేక బాధితురాలు ఫిబ్రవరి 5న ఆమె కూతురికితో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మార్చి 9న బాధితురాలి ఇంటికి వెళ్లిన నిందితుడు వజీర్ ఇక నుంచి నిన్ను బాగా చూసుకుంటానని మాయమాటలు చెప్పి అతని భార్యను అతని ఇంటి పిలుచుకుని వెళ్లాడు.

సేమ్ సీన్ రిపీట్

సేమ్ సీన్ రిపీట్

కొన్నిరోజుల తరువాత వజీర్, కుటుంబ సభ్యులు బాధితురాలిపై మరోసారి దాడి చేశారు. అదనపు కట్నం తీసుకురావాలని వేధించి అర్ధరాత్రి తన ఇంటి సమీపంలోకి తీసుకొచ్చి నడిరోడ్డు మీద నన్ను, నా బిడ్డను వదిలేసి వెళ్లిపోయారని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

బాధితురాలి తల్లిదండ్రులు గాయపడిన తనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నామని ఆర్ టీ నగర్ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+