Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియుడితో మిడ్ నైట్ మసాలా, భర్తను చంపేసి నడుముకు రాయి కట్టిన భార్య, క్లైమాక్స్ లో!

బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఇదే సమయంలో భర్తతో పాటు పని చేస్తున్న ఓ వయువకుడు దంపతుల ఇంటికి వెళ్లిరావడం మొదలు పెట్టాడు. రానురాను భర్త ఇంట్లో లేని సమయంలో అతని స్నేహితుడు ఒంటిరిగా వారి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. భర్త లేని సమయంలో ఇంటికి వెలుతున్న యువకుడు అతని భార్యతో అసలు మ్యాటర్ మొదలుపెట్టాడు.

తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలోని మహారాజకడై ప్రాంతంలో ఓ వ్యక్తి శవం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఒక్క రోజు అయినా శవం ఎవరిది అని పోలీసులు గుర్తించలేకపోయారు. చివరికి కాళ్లనాయకనపాళ్యం గ్రామానికి చెందిన రాజ్ అలియాస్ జోసెఫ్ (35) అనే వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై కనిపించాడని పోలీసులు గుర్తించారు. రవి మృతదేహం కడుపుకు తాడు బిగించి బావిలో విసిరేశారని పోలీసులు గుర్తించారు.

A wife who killed her husband along with her boyfriend and threw his body into a well near Krishnagiri

ఈ విషయాన్ని కల్లుకురుగు గ్రామ పరిపాలనాధికారి తంగరాజు మహరాజగడై పోలీస్‌స్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది. ఇన్‌స్పెక్టర్‌ సంపూర్ణం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో తేలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే ఆ ప్రాంతంలో ఎవరైనా అదృశ్యమయ్యారా? వారు విచారణ చేపట్టారు. విచారణలో ఆ ప్రాంతంలోని అటుకవాయికి చెందిన కల్లు విరిచే మైఖేల్‌రాజ్ అలియాస్ జోసెఫ్ అదృశ్యమైనట్లు తేలింది. అనంతరం అతని భార్య జోసెఫిన్ సింధు (28)ని పోలీసులు విచారించారు.

సింధు పరస్పర విరుద్ధమైన సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సిందును సీరియస్‌గా విచారించారు. బావిలో దొరికిన మృతదేహం మైఖేల్ రాజ్ అని, అతని భార్య జోసెఫిన్ సింధు మరియు ఆమె ప్రేమికుడు విక్రమ్ (19)తో కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అనంతరం వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన జోసెఫ్ సింధు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నా భర్త స్వస్థలం సేలం జిల్లా అత్తూరు సమీపంలోని చిన్నప్ప నగర్ అని చెప్పింది, రాజ్ క్వారిలో పని చేసేవాడు. రాజ్, నేను వివాహం చేసుకున్నామని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని సింధు పోలీసులకు చెప్పింది. గత ఏడాది క్రితం కృష్ణగిరి జిల్లా మహారాజకడై సమీపంలోని ఆతుకవాయి ప్రాంతానికి వచ్చామని ఇక్కడే నా భర్త రాజ్ క్వారిలో పని చేస్తున్నాడని సింధు పోలీసులకు చెప్పింది.

క్రిష్ణగిరి ధర్మరాజ నగర్‌కు చెందిన శ్రీనివాసులు కుమారుడు విక్రమ్ (19) తాను పనిచేస్తున్న క్వారీలో పనిలో చేరాడు. నా భర్త రాజ్ తో కలిసి విక్రమ్ మా ఇంటికి తరచుగా వచ్చేవాడని, అప్పుడు నేను తనకంటే వయసులో చిన్నవాడు అయిన విక్రమ్ తో చనువు పెంచుకున్నానని, తరువాత మేము అక్రమ సంబంధం పెట్టుకున్నామని సింధు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

నా భర్త రాజ్ ఇంట్లో లేని సమయంలో తరచూ వచ్చి నాతో విక్రమ్ ఎంజాయ్ చేశాడని, కొంతకాలం నుంచి రాత్రి పూటకూడా విక్రమ్ తన ఇంటికి వచ్చి వెళ్లాడని సింధు పోలీసులకు చెప్పింది. తన అక్రమ సంబంధంగురించి నా భర్త రాజ్ కు ఇటీవలే తెలిసిందని, తరువాత తనతో పాటు విక్రమ్ ను మందలించాడని సింధు చెప్పింది.

తనతో ఉన్న నకిలీ సంబంధాన్ని వదిలేయాలని విక్రమ్ ను, తనను తన భర్త రాజ్ బెదిరించాడని, ఈ విషయం గురించి తన ప్రియుడు విక్రమ్, నేను కలిసి ఏం చెయ్యాలని ఆలోచించామని సింధు పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత నా భర్త రాజ్ హత్యకు గురైతే తరువాత మనం సరదాగా గడపొచ్చు అని విక్రమ్ తనతో చెప్పాడని ఇద్దరూ ఉల్లాసమైన జీవితం గడపాలని, ఎవరూ అడ్డురారని ఆలోచించామని సింధు పోలీసులకు చెప్పింది.

నా భర్త రాజ్ ఇంట్లో ఉన్నాడని విక్రమ్‌కు తాను సమాచారం అందించాను, నా ప్రియుడు ఇంటికి రావడంతో మేమిద్దరం కలిసి నా భర్త రాజ్ ను కొట్టి చంపాం. అనంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి కాళ్లనాయకనపాళ్యం ప్రాంతానికి తీసుకొచ్చి మా వద్ద ఉన్న తాడును తీసుకుని నా భర్త మృతదేహాన్ని రాయికి కట్టి బావిలో పడేశామని సింధు పోలీసుల విచారణలో అంగీకరించింది.

తర్వాత ఎవరికీ తెలియకుండా ఇంటికి చేరుకున్నామని, నా భర్త రాజ్ శవానికి రాయి కట్టి బావిలో వేస్తే ఆ శరీరం పైకి రాదని, హత్య విషయం ఎవరికీ తెలియదని అనుకున్నామని, కానీ మృతదేహం పైకి వచ్చి పోలీసులకు చిక్కుకున్నామని సింధు విచారణలో అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు రాజ్ భార్య సింధు, ఆమె ప్రియుడు విక్రమ్ ను అరెస్టు చేసి కేసు విచాణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+