అమావస్య రోజు బాలింతను హత్య చేసి శవాన్ని కాల్చి బూడిద చేశారు, నిధి కోసం నరబలి?

అమావస్య రోజు రెండు నెలల బాలింతను అతి దారుణంగా హత్య చేసి ఆమె శవాన్ని కాల్చి బూడిద చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరు/కోప్పళ: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఇటీవల పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. డెలవరీ కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉన్న భార్యను చూడటానికి ఆమె భర్త వారంలో ఒకరోజు వెళ్లి వస్తున్నాడు. రెండు నెలల బాలింతను అతి దారుణంగా హత్య చేసి ఆమె శవాన్ని కాల్చి బూడిద చెయ్యడం కలకలం రేపింది.

కర్ణాటకలోని కోప్పళ సమీపంలోని గబ్బూరు గ్రామంలో నేత్రావతి (26) అనే మహిళ నివాసం ఉంటున్నది. మూడు సంవత్సరాల క్రితం నేత్రావతికి వివాహం అయ్యింది. రెండు నెలల క్రితం నేత్రావతికి బిడ్డపుట్టింది. కాన్ఫు కోసం పుట్టింటికి వెళ్లిన నేత్రావతి అక్కడే ఉంది. సోమవారం రాత్రి భోజనం చేసిన నేత్రావతి తరువాత ఓ గదిలో నిద్రపోయింది.

Accused of murdering woman on Amavasya day near Koppal in Karnataka

సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత నేత్రావతిని ఎవరో ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వెళ్లారు, బాలింత నేత్రావతిని హత్య చేసిన నిందితులు కర్రలు, చెత్త, ఎండుగడ్డి ఆమె శరీరం మీద వేసి ఆమె శవాన్ని కాల్చి బూడిద చేశారు. మంగళవారం గ్రామం సమీపంలో మహిళ శవం గుర్తించిన స్థానికులు హడలిపోయి కోప్పళ గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇదే సమయంలో బాలింత నేత్రావతి కూడా కనపడకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. గ్రామం బయట శవమైన మహిళ నేత్రావతిదే అని పోలీసులు నిర్దారించారు. కోప్పళ పరిసర ప్రాంతాల్లో నిధి సంపాధించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారని, అమావస్య రోజు నేత్రావతిని నిధి కోసం కొందరు బలి ఇచ్చి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిధి కోసం నేత్రావతిని హత్య చేశారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+