• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: నటి ఆత్మహత్య, మొబైల్ ఫోన్ కాల్ డేటాలో, సెలబ్రిటీలా లగ్జరీ లైఫ్ జీవించాలని, డబ్బులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హైదరాబాద్: కన్నడ టీవీ సీరియల్స్, కన్నడ సినిమాలలో నటించిన సౌజన్యా అలియాస్ సవి మాదప్ప ఆత్మహత్య కేసు వేగవంతం అయ్యింది. నటి సౌజన్యాకు ఎవరెవరు ఫోన్లు చేశారు ?, ఆమె ఎవరెవరికి ఫోన్లు చేసింది ?, వారు ఏమి మాట్లాడుకున్నారు అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నటి సౌజన్యా ఆత్మహత్య కేసులో ఆమె ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ ను ఇప్పుడు పోలీసులు కీలకసాక్షంగా ముందు పెట్టుకుని విచారణ చేస్తున్నారు. నటి సౌజన్యా సెలబ్రిటీల లాగా జీవనం సాగించాలని అనుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సెలబ్రిటీ జీవితం గడపడానికి సీరియల్స్ లో, సినిమాల్లో నటిస్తూ సంపాధిస్తున్న డబ్బులు సౌజన్యాకు సరిపోలేదని, అందుకే ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని, తెలిసినవారి దగ్గర అప్పులు కూడా చేసిందని బెంగళూరు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని తెలిసింది.

Target: షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ లు దేశం వదిలేయాలి, మేము కోట్లు ఇస్తుంటే మీరు జల్సా చేస్తారా !Target: షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ లు దేశం వదిలేయాలి, మేము కోట్లు ఇస్తుంటే మీరు జల్సా చేస్తారా !

సొంత అపార్ట్ మెంట్ లో నటి సౌజన్యా !

సొంత అపార్ట్ మెంట్ లో నటి సౌజన్యా !

బెంగళూరులోని కుంబలగూడులోని అపార్ట్ మెంట్ లో కన్నడ నటి సౌజన్యా నివాసం ఉండేది. గత గురువారం సౌజన్యా ప్రియుడు వివేక్ అపార్ట్ మెంట్ లోకి వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది, సౌజన్యా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు వివేక్ అక్కడి నుంచి పరారైనాడని ఆరోపణలు ఉన్నాయి.

ఇంగ్లీష్ లో డెత్ నోట్ రాసిన నటి

ఇంగ్లీష్ లో డెత్ నోట్ రాసిన నటి

నటి సౌజన్యా అలియాస్ సవి మాదప్ప సెప్టెంబర్ 27వ తేదీన డెత్ నోట్ రాసిపెట్టిందని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకోవాలని నటి సౌజన్యా ముందుగానే నిర్ణయం తీసుకుందని, అందుకే డెత్ నోట్ రాసిపెట్టిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి సౌజన్యా కన్నడలో కాకుండా ఇంగ్లీష్ లో డెత్ నోట్ ఎందుకు రాసింది ? అనే అనుమానాలను ఆమె కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

తెరమీదకు నటుడి పేరు

తెరమీదకు నటుడి పేరు


కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ నటుడు వివేక్ తన కుమార్తె సౌజన్యాను పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, తన కుమార్తె పీఏ మహేష్ కూడా ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యాడని నటి సౌజన్యా తండ్రి మాదప్ప ఇప్పటికే బెంగళూరులోని కుంబలగూడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న తన కుమార్తె సౌజన్యా వెంటపడిన నటుడు వివేక్ తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని సౌజన్యా తండ్రి మదప్ప అతని మీద కేసు పెట్టారు.

దేవుడు మీద భారం వేసిన నటి బాయ్ ఫ్రెండ్

దేవుడు మీద భారం వేసిన నటి బాయ్ ఫ్రెండ్

కన్నడ నటి సౌజన్యా ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఆమె మేకప్ మ్యాన్, పీఏగా పని చేస్తున్న మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నటి సౌజన్యా ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన కూతురు ఆత్మహత్య చేసుకుందనే భాదతో ఆమె తండ్రి మాదప్ప తన మీద ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటారని నటి బాయ్ ఫ్రెండ్, తెలుగు, కన్నడ టీవీ సీరియల్ నటుడు వివేక్ అంటున్నాడు.

 నటి మొబైల్ ఫోన్ కీలకం

నటి మొబైల్ ఫోన్ కీలకం

కన్నడ టీవీ సీరియల్స్, కన్నడ సినిమాలలో నటించిన సౌజన్యా అలియాస్ సవి మాదప్ప ఆత్మహత్య కేసు వేగవంతం అయ్యింది. నటి సౌజన్యాకు ఎవరెవరు ఫోన్లు చేశారు ?, ఆమె ఎవరెవరికి ఫోన్లు చేసింది ?, వారు ఏమి మాట్లాడుకున్నారు అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నటి సౌజన్యా ఆత్మహత్య కేసులో ఆమె ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ ను ఇప్పుడు పోలీసులు కీలకసాక్షంగా ముందు పెట్టుకుని విచారణ చేస్తున్నారు. నటి సౌజన్యా ఆత్మహత్య చేసుకునే వారం రోజుల ముందు నుంచి పోలీసులు మొబైల్ కాల్ డేటాను బయటకు లాగుతున్నారు.

 సెలబ్రిటీలా బతకాలని అప్పులు చేసిన నటి ?

సెలబ్రిటీలా బతకాలని అప్పులు చేసిన నటి ?

నటి సౌజన్యా అందరు సెలబ్రిటీల లాగా తాను జీవనం సాగించాలని అనుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సెలబ్రిటీ లాగా జీవితం గడపడానికి సీరియల్స్ లో, సినిమాల్లో నటిస్తూ సంపాధిస్తున్న డబ్బులు సౌజన్యాకు సరిపోలేదని, అందుకే ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని, తెలిసినవారి దగ్గర అప్పులు కూడా చేసిందని బెంగళూరు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని తెలిసింది.

అపార్ట్ మెంట్ లో విచారణ

అపార్ట్ మెంట్ లో విచారణ

నటి సౌజన్యా నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఆమెకు పరిచయం ఉన్న వారి నుంచి పోలీసులు వివరాలు సేకరించారని తెలిసింది. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారితో పాటు అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న సెక్యూరిటీ గార్డుల నుంచి వివరాలు సేకరించారని, నటి ఆత్మహత్య చేసుకునే ముందు మూడు రోజులు అపార్ట్ మెంట్ లోకి ఎవరెవరు వచ్చి వెళ్లారు అంటూ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలించారని తెలిసింది. మొత్తం మీద నటి సౌజన్యా మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

English summary
Actress: Kannada actress Soujanya death case enquiry based on mobile calls in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X