కాలేజ్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్, మస్త్ మసాలా సాంగ్ కోసం గొడవ, విద్యార్థిని చంపేసి!
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నిరసనలకు, గొడవలకు కొదవలేకుండాపోయింది. కాలేజ్ లో చదువుకుంటున్న అబ్బాయిలు కొన్ని విషయాల్లో గొడవలు పడుతున్నారు. డ్యాన్స్ చేసే విషయంలో విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవల కారణంగా పీయూసీ (ఇంటర్ )విద్యార్థి హత్యకు దారి తీసింది. బెంగళూరులో ఓ కాలేజీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మంజునాథ్ నగర్‌లోని గౌతమ్ కాలేజీ సమీపంలో చోటుచేసుకుంది.
కాలేజ్ అబ్బాయిని కత్తితో పొడిచి హత్య చేయగా బసవేశ్వర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. హత్యకు గురైన యువకుడిని బెంగళూరులో నివాసం ఉంటున్న సోహైల్ (17)గా గుర్తించామని పోలీసులు అన్నారు. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న సోహైల్ కు అదే కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులకు డ్యాన్స్ చేసే విషయంలో గొడవ మొదలైంది. ఈ సమయంలో విద్యార్థుల నోటి దురుసుతో గొడవ పెద్దది కావడంతో సోహైల్ ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.

ఈ గొడవలో కత్తితో పొడవడంతో సోహైల్ రక్తపు మడుగులో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం పశ్చిమ డివిజన్ డీసీపీ లక్ష్మణ్ నింబరగి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. దీంతో పాటు బసవేశ్వర్‌నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థి సోహైల్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆస్పత్రిలో సోహైల్ మృతి చెందాడు.
రెండు నెలల క్రితం బెంగళూరులోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటైన రేవా కాలేజీలో ఓ విద్యార్థిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన కూడా కళాశాల సాంస్కృతికోత్సవం సందర్భంగా జరిగింది. గత ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు రేవా కాలేజీలో నిర్వహించిన కాలేజ్ ఫెస్టివల్ (బెంగళూరు రేవా కాలేజీ ఫెస్ట్) సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ కారణంగా కాలేజ్ అబ్బాయి హత్యకు దారితీసింది.












Click it and Unblock the Notifications