బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bajrang Dal: హర్షాను చంపేసి బెంగళూరు ఎస్కేప్, చిన్న విషయంలో గొడవ, డ్రగ్స్ దెబ్బతోనే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోతోంది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు అంటున్నారు. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారని పోలీసు అధికారులు అంటున్నారు.

హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి ఆరు నెలల క్రితం చిన్న గొడవ జరిగిందని విచారణలో వెలుగు చూసిందని శివమొగ్గ జిల్లా ఎస్పీ అంటున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక టీమ్ లు భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులోని నిందితులు అందర్ని అరెస్టు చెయ్యాలని వారి కోసం గాలిస్తున్నారు. శివమొగ్గ పట్టణంలో 25 మంది పోలీసు అధికారులతో పాటు 450 మంది అదనపు పోలీసులు బందోబస్తులో నిమగ్నం అయ్యారు. డ్రగ్స్ మత్తులోనే హర్షాను చంపేశారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Muslim goons: ముస్లీం గూండాలను డీకేసీ రెచ్చగొట్టి అమాయకులను చంపిస్తున్నారు, మంత్రి ఫైర్!Muslim goons: ముస్లీం గూండాలను డీకేసీ రెచ్చగొట్టి అమాయకులను చంపిస్తున్నారు, మంత్రి ఫైర్!

భజరంగ్ దళ్, గోసంరక్షణ సమితి

భజరంగ్ దళ్, గోసంరక్షణ సమితి

భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోతోంది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

 చంపేసి బెంగళూరు ఎస్కేప్

చంపేసి బెంగళూరు ఎస్కేప్

శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారని పోలీసు అధికారులు అంటున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో శివమొగ్గలోని బుద్దానగర్ లో నివాసం ఉంటున్న ఖాసీమ్ (30), బెంగళూరులోని జేపీ నగర్ లో నివాసం ఉంటున్న సయ్యద్ నదీమ్ (20) అనే ఇద్దరిని అరెస్టు చేశామని శివమొగ్గ జిల్లా ఎస్సీ బీఎం. లక్ష్మీ ప్రసాద్ అధికారికంగా మీడియాకు చెప్పారు.

చిన్న విషయంలో గొడవ

చిన్న విషయంలో గొడవ

హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి ఆరు నెలల క్రితం చిన్న గొడవ జరిగిందని, ఆ విషయంలో హత్య జరిగే అవకాశం ఉంటుందని విచారణలో వెలుగు చూసిందని శివమొగ్గ జిల్లా ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ అంటున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించారు. డ్రగ్స్ మత్తులోనే హర్షాను చంపేశారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Hyderabad : భజరంగ్ దళ్ భయం.. జంటలు లేక బోసిపోయిన టాంక్ బండ్ పరిసరాలు | Oneindia Telugu
శివమొగ్గలో మాత్రమే 500 మంది పోలీసులు

శివమొగ్గలో మాత్రమే 500 మంది పోలీసులు

ఇప్పటికే నాలుగు ప్రత్యేక టీమ్ లు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులోని నిందితులు అందర్ని అరెస్టు చెయ్యాలని వారి కోసం గాలిస్తున్నారు. శివమొగ్గ పట్టణంలో 25 మంది పోలీసు అధికారులతో పాటు 450 మంది అదనపు పోలీసులు బందోబస్తులో నిమగ్నం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా శివమొగ్గలోని సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపిన పోలీసు అధికారులు శివమొగ్గ పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు.

English summary
Bajrang Dal: The team of the Shivamogga police which is investigating the murder of Bajrang Dal activist Harsha suspects that the gang of five men committed the act under the influence of drugs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X