అసలు ఏం జరిగిందో ఆలోచిస్తున్నాము, పవర్ లీడర్స్ తో, బసవరాజ్ బోమ్మయ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు. ఏ పార్టీ ఓడిపోయినా వాళ్లు చెప్పేమాట ఒక్కటే. మేము ఎందుకు ఓడిపోయాము అని ఆత్మపరిశీలన చేసుకుంటున్నామని ?, ఎక్కడ ఏంజరిగింది ? అని ఆరా తీస్తున్నామని సేమ్ డైలాగ్ చెబుతున్నారు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన తరువాత ఆ విషయం గురించి ఆ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సర్వసాధారణం అని, గెలుపు ఓటములను రాజకీయ నాయకులు సమానంగా చూసుకోవాలని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

2019 నుంచి కర్ణాటకో అధికారంలో ఉన్న బీజేపీ కర్ణాటకలో ఎందుకు ఓడిపోయింది అని మొత్తం ఆరా తీస్తున్నామని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. తనతో పాటు మంత్రులుగా పని చేసిన బళ్లారి శ్రీరాములు, చిక్కబళ్లాపురంకు చెందిన డాక్టర్ సుధాకర్ తో తాను మాట్లాడారని, ఇద్దరు ఓడిపోవడానికి అనేక కారణాలు చెప్పారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
మాజీ మంత్రి సోమన్న బెంగళూరు నుంచి వరుణాకు వెళ్లి మాజీ సీఎం సిద్దరామయ్య మీద, చామరాజనగర్ లో మరో వ్యక్తి మీద పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారని, 40 ఏళ్ల నుంచి సోమన్న ప్రజా సేవలో ఉంటున్నారని. ఆయన సేవలు బీజేపీకి చాలా అవసరం అని బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి ఏమిటి కారణం అని పార్టీ నాయకులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారని బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications